ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sajjala Ramakrishna Reddy: వైసీపీ ధర్మ యుద్ధమే చేస్తుంది: సజ్జల

ABN, First Publish Date - 2023-03-19T18:56:49+05:30

వైసీపీ ధర్మ యుద్ధమే చేస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తెలిపారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌటింగ్లో అక్రమాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: వైసీపీ ధర్మ యుద్ధమే చేస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తెలిపారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌటింగ్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కౌంటింగ్ వేళ అధికారుల తీరును అందరూ చూశారన్నారు. టీడీపీ (TDP) బండిల్స్లో వైసీపీ ఓట్లు కలిశాయని తెలిపారు. రీకౌంటింగ్ చేయమని అడగడం అభ్యర్థి హక్కు అని పేర్కొన్నారు. సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే డిక్లరేషన్ (Declaration) అపారన్న.. విమర్శలపై సజ్జలు సమాధానం దాటవేశారు. అభ్యంతరాలు ఉంటే ఆర్ఓ కౌంటింగ్ అయ్యాక అడగాలని, కౌంటింగ్ అయ్యాక మరలా అభ్యంతరంతో లేఖ ఇచ్చామన్నారు. గెలిచిన అభ్యర్థుల ఓట్లు ఎన్నో మరోసారి.. సరిచూడమని అడిగే అవకాశం తమకు లేదా? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జయకేతనం ఎగురవేసింది. మూడుకు మూడూ గెలిచి ‘క్లీన్‌ స్వీప్‌’ చేసేసింది. అధికార పార్టీకి చేదు అనుభవమే మిగిలింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్‌ విజయం శుక్రవారం రాత్రే ఖరారైంది. భారీ స్థాయిలో తొలి ప్రాధాన్య ఓట్లు సాధించినప్పటికీ... వీరి విజయానికి రెండో ప్రాధాన్య ఓట్లూ అవసరమయ్యాయి. పెద్దగా ఉత్కంఠ లేకుండానే... వీరి గెలుపునకు అవసరమైన ఓట్లు వచ్చేశాయి. ఉత్తరాంధ్ర పట్టభద్ర స్థానం టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావు వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌పై 34,936 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. తూర్పు రాయలసీమ స్థానంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ వైసీపీ అభ్యర్థి శ్యామ్‌ ప్రసాదరెడ్డికంటే 34,110 ఓట్ల మెజారిటీ సాధించారు. పశ్చిమ రాయలసీమ టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి 7543 ఓట్ల మెజారిటీ సాధించారు.

Updated Date - 2023-03-19T18:56:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising