ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: సీబీఐ ప్రస్తావనతో జగన్‌ పాత్ర బహిర్గతమైంది

ABN, First Publish Date - 2023-05-26T22:31:04+05:30

వివేకా హత్యలో జగన్‌రెడ్డి పాత్ర జగమెరిగిన సత్యమని చంద్రబాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu) అధ్యక్షతన పొలిట్‌ బ్యూరో సమావేశం జరిగింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై (YS Vivekananda Reddy murder case) పొలిట్‌ బ్యూరోలో టీడీపీ (TDP) నేతలు చర్చించారు. వివేకా హత్యలో జగన్‌రెడ్డి పాత్ర జగమెరిగిన సత్యమని చంద్రబాబు అన్నారు. వివేకా హత్య కేసును ఎన్ని మలుపులైనా తిప్పుతారు? అని, సీబీఐ ప్రస్తావనతో జగన్‌ పాత్ర బహిర్గతమైందని చంద్రబాబు తెలిపారు. కుట్ర బయటపడుతుందనే అవినాశ్‌ను అరెస్ట్‌ చేయనీవలేదని, సీబీఐ అరెస్ట్‌ చేయకుండా పోలీసులను అడ్డుపెట్టుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. అరెస్టు కాకుండా ఉండేందుకే మరో డేరాబాబా ఎపిసోడ్‌ తలపించారని చంద్రబాబు విమర్శించారు.

ఇది ఇలా ఉండగా.. CBI కౌంటర్ అఫిడవిట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కౌంటర్ అఫిడవిట్‌లో జగన్‌రెడ్డి పేరు సీబీఐ ప్రస్తావించింది. జగన్‌కు హత్య విషయం అవినాష్ రెడ్డి చెప్పారా అనే విషయంపై దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. వివేక హత్య విషయం జగన్‌కు ఉదయం 6.15 నిమిషాలకు ముందే తెలిసినట్టు దర్యాప్తులో తేలిందని సీబీఐ తెలిపింది. వివేకా హత్య విషయం ఎంవీ కృష్ణారెడ్డి బయట పెట్టక ముందే జగన్‌రెడ్డికి తెలుసని సీబీఐ పేర్కొంది.

Updated Date - 2023-05-26T22:33:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising