Viveka case: అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణపై సునీతారెడ్డికి క్లారిటీ ఇచ్చిన హైకోర్ట్
ABN, First Publish Date - 2023-05-26T16:46:08+05:30
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) న్యాయం కోసం పోరాడుతున్న వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డికి (Sunita Reddy) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) తేల్చేసి చెప్పింది.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ రోజే (శుక్రవారం) అందరి వాదనలు వింటామని ఆయన కుమార్తె సునీతారెడ్డికి (Sunita Reddy) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) తేల్చి చెప్పింది. అవినాష్ తరపు లాయర్‌కు (Avinash Reddy Lawyer) ఎంత సమయం ఇచ్చారో... తమకూ అంతే సమయం ఇవ్వాలన్న సునీతా రెడ్డి తరపు లాయర్‌పై జడ్జి అసహనం వ్యక్తం చేశారు. సునీతారెడ్డి న్యాయవాది వాదనలపై స్పందిస్తూ లిమిట్స్‌లో ఉండాలంటూ జడ్జి వ్యాఖ్యానించారు.
కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇరు వైపుల వాదనలు వాడివేడిగా సాగుతున్నాయి. 2020 జులై 9న సీబీఐ FIR నమోదు చేసి 2021 జులై 21న రంగన్నను సీబీఐ విచారించిందని అవినాష్ రెడ్డి లాయర్ కోర్టుకు తెలిపారు. రంగన్న స్టేట్‌మెంట్ రికార్డు చేసి సంవత్సరం పాటు వదిలేశారని, స్టేట్‌మెంట్‌లో క్లియర్‌గా నలుగురి వివరాలు చెప్పాడని అవినాష్ లాయర్ అన్నారు.
కానీ సీబీఐ నెలరోజుల పాటు దస్తగిరిని విచారణకు పిలవలేదని, దస్తగిరిని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేదని అవినాష్ లాయర్ వాదించారు. మున్నా దగ్గర డబ్బు దొరికినా ఛార్జ్‌షీట్‌లో సాక్షిగా పేర్కొనలేదని, దస్తగిరి స్టేట్‌మెంట్‌లో అవినాష్ పేరు ఎక్కడైనా చెప్పాడా? అని జడ్జి ప్రశ్నించారు. దస్తగిరి దగ్గర 3 సార్లు 161 కింద సీబీఐ స్టేట్‌మెంట్ తీసుకుందని, మొదటి స్టేట్‌మెంట్‌లో ఎక్కడ అవినాష్ గురించి చెప్పలేదని అవినాష్ లాయర్ చెప్పారు. చివరి స్టేట్‌మెంట్‌లో గంగిరెడ్డి తనతో చెప్పిన వ్యాఖ్యలలో అవినాష్ తమ వెనుకాల ఉన్నాడని చెప్పినట్టు స్టేట్‌మెంట్ ఇచ్చారని లాయర్ పేర్కొన్నారు.
Updated Date - 2023-05-26T17:11:21+05:30 IST