ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Varla Ramaiah: వివేకా హత్య కేసులో అన్నీ తెలిసే జగన్‌ బుకాయిస్తున్నారు

ABN, First Publish Date - 2023-05-18T18:12:47+05:30

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అన్నీ తెలిసే సీఎం జగన్‌మోహన్ రెడ్డి బుకాయిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) అన్నీ తెలిసే సీఎం జగన్‌మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) బుకాయిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) విమర్శించారు. వివేకా హత్య ఎవరు చేశారు? అనే వివరాలు జగన్కు తెలుసు అని వర్ల రామయ్య అన్నారు. ఎందుకు, ఎలా, ఎప్పుడు అనే వివరాలు జగన్కు ముందే తెలుసు అని, వివరాలు తెలిసి బహిర్గతం చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, సీఎంగా జగన్ రెడ్డి చేసిన ప్రమాణానికి అది వ్యతిరేకమని వర్ల రామయ్య మండిపడ్డారు.

జగన్ అంటే గిట్టనివారిపై అక్రమ గంజాయి కేసులు పెట్టడం సిగ్గుచేటని, అక్రమ గంజాయి కేసులు జగన్ మెడకే చుట్టుకుంటాయని వర్ల రామయ్య అన్నారు. గంజాయి స్మగ్లర్లను శిక్షించడానికి వినియోగించాల్సిన పోలీస్ వ్యవస్థను ప్రశ్నించేవారి గొంతునొక్కడానికి వాడటం సరైనది కాదని వర్ల రామయ్య తెలియజేశారు. జగన్‌ను వ్యతిరేకించినందుకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తప్పుడు కేసులకు బలయ్యారని వర్ల రామయ్య ఆరోపించారు.

ఇటీవల వర్ల రామయ్య (Varla Ramaiah) మాట్లాడుతూ మాజీ మంత్రి కెఎస్ జవహర్‌ (Jawahar)ను పోలీసులు అవమానించిన ఘటనపై డీజీపీ (DGP)కి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ యువతకు రోల్ మోడల్స్‌గా నిలవాల్సిన పోలీసులు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడటం శోచనీయమన్నారు. రోజు రోజుకు ఏపీ పోలీసులలో క్రమశిక్షణరాహిత్యం పెరిగిపోతోందని విమర్శించారు. చిత్తూరు జిల్లా నగరి సిఐ శ్రీనివాసంతి వ్యవహారశైలి ఇందుకు నిదర్శనమన్నారు.

Updated Date - 2023-05-18T18:13:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising