ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

iPhone 15: ఐఫోన్ 15 దెబ్బకు ఇండియాలో తట్టాబుట్టా సర్దేసిన ఈ నాలుగు ఫోన్లు.. అవేంటంటే?

ABN, First Publish Date - 2023-09-13T17:59:10+05:30

సాధారణంగా.. యాపిల్ సంస్థ నుంచి కొత్త ఐఫోన్ సిరీస్ లాంచ్ అయిన ప్రతీసారి, గత ఐఫోన్ మోడళ్ల ధరలు గణనీయంగా తగ్గిపోతుంటాయి. అప్పుడు మార్కెట్‌లో వాటి విక్రయాలు అమాంతం పెరుగుతాయి. ముఖ్యంగా..

సాధారణంగా.. యాపిల్ సంస్థ నుంచి కొత్త ఐఫోన్ సిరీస్ లాంచ్ అయిన ప్రతీసారి, గత ఐఫోన్ మోడళ్ల ధరలు గణనీయంగా తగ్గిపోతుంటాయి. అప్పుడు మార్కెట్‌లో వాటి విక్రయాలు అమాంతం పెరుగుతాయి. ముఖ్యంగా.. భారత మార్కెట్‌లో పాత మోడల్స్‌కే ఎక్కువ గిరాకీ ఉంటుంది. బహుశా దీని వల్లనో లేక మరే ఇతర కారణమో తెలీదు కానీ.. ఇటీవల ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసిన యాపిల్ సంస్థ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా నాలుగు ఐఫోన్ మోడల్స్‌ని భారత మార్కెట్ నుంచి లేపేసింది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. అవి ఏంటంటే.. ఐఫోన్ 12, ఐఫోన్ 13 మిని, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్.


ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో మోడల్స్ మార్కెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు.. వాటి ధరలు వరుసగా రూ.1,39,900, రూ. 1,29,900గా ఉండేవి. కానీ.. ఇప్పుడు ఈ రెండు ఫోన్లను యాపిల్ సంస్థ తన అధికారిక భారత వెబ్‌సైట్ నుంచి తొలగించేసింది. ఈ రెండింటితో పాటు రూ. 69,900 ధరతో అందుబాటులో ఉండే 128జీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 13 మిని మోడల్‌కి కూడా గుడ్‌బై చెప్పేసింది. ఇక 2020లో రూ.59,900లతో లాంచ్ అయిన 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ఐఫోన్ 12 కూడా యాపిల్ వెబ్‌సైట్‌లో మాయమైపోయింది. అయితే.. ఈ మోడల్స్ మాత్రం థర్డ్ పార్టీ రిటైలర్స్‌, ప్రముఖ ఈ-కామర్స్ (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్) వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉంటాయి. బ్రిక్ & మోర్టార్ దుకాణాలు ఈ మోడల్స్‌ని స్టాక్స్ అయిపోయేదాకా విక్రయిస్తూనే ఉంటాయి.

ఉన్నపళంగా యాపిల్ సంస్థ ఈ నాలుగు పాత మోడళ్లను భారత్ మార్కెట్‌లో నిలిపివేయడానికి కారణం.. కొత్త మోడళ్ల కోసమేనని కంపెనీ నిబద్ధతను సూచిస్తుంది. కొత్త మోడళ్ల అమ్మకాలు గణనీయంగా జరగాలన్న ఉద్దేశం ఒకటైతే.. లేటెస్ట్ టెక్నాలజీ & వాటిల్లోని ఫీచర్స్‌ని అనుభూతి పొందాలన్నది మరో ఉద్దేశం అయి ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా.. మార్కెట్‌లో స్టాక్ ఉన్నంతవరకే ఆ నాలుగు మోడల్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి.. ఎవరైనా కొనుగోలు చేయాలనుకునే వారు, వీలైనంత త్వరగా కొంటే మంచిది. ఇక ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి. వీటి ధరలు గత మోడల్స్ కన్నా చాలా ఎక్కువగానే ఉన్నాయి.

Updated Date - 2023-09-13T17:59:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising