డాక్టర్స్ ఫార్మసీకి అవార్డు
ABN , First Publish Date - 2023-04-02T01:36:40+05:30 IST
ఈ-కామర్స్ ద్వారా ఔషధాలను పంపిణీ చేస్తూ.. సమగ్ర వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్స్ ఫార్మసీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తన సేవలను విస్తరించాలని భావిస్తోంది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఈ-కామర్స్ ద్వారా ఔషధాలను పంపిణీ చేస్తూ.. సమగ్ర వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్స్ ఫార్మసీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తన సేవలను విస్తరించాలని భావిస్తోంది. పోస్ట్ మెడికేషన్ సేవలపై దృష్టి సారించనున్నామని డాక్టర్స్ ఫార్మసీ ఎండీ సునీత తెలిపారు. కొవిడ్ కాలంలో తాము అందించిన సేవలను గుర్తిస్తూ అత్మనిర్భర్ అవార్డు ఇచ్చారని.. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి ఎమర్జింగ్ ఫార్మా లీడర్ అవార్డు లభించిందని చెప్పారు. అమెరికాలో 20 ఏళ్ల పాటు క్లినికల్ ఫార్మాసిస్టుగా పని చేసి తెలంగాణలో సేవలందించడానికి సమగ్ర వైద్య సేవలను చేపట్టినట్లు వివరించారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీల ద్వారా మెరుగైన సేవలందించడానికి నైపర్తో చేతులు కలుపుతున్నట్లు చెప్పారు.