Diabetic Foot And Podiatry Institute: చెన్నైలో దేశంలోనే తొలి డయాబెటిక్ ఫుట్ అండ్ పొడియాట్రీ ఇనిస్టిట్యూట్
ABN, First Publish Date - 2023-01-08T16:51:16+05:30
దేశంలోనే మొట్టమొదటి డయాబెటిక్ ఫుట్ అండ్ పొడియాట్రీ ఇనిస్టిట్యూట్ ( Diabetic Foot And Podiatry Institute) చెన్నైలో ప్రారంభమైంది. ప్రీమియర్
చెన్నై: దేశంలోనే మొట్టమొదటి డయాబెటిక్ ఫుట్ అండ్ పొడియాట్రీ ఇనిస్టిట్యూట్ ( Diabetic Foot And Podiatry Institute) చెన్నైలో ప్రారంభమైంది. ప్రీమియర్ డయాబెటిక్ ఫుట్ కేర్ ఫెసిలిటీలో ఒకటైన డాక్టర్ ఆర్కే డయాబెటిక్ ఫుట్ అండ్ పొడియాట్రీ ఇనిస్టిట్యూట్, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా అంప్యుటేషన్ ప్రివెన్షన్ సెంటర్ నగరంలోని కొలత్తూర్( Kolathur) వద్ద దీనిని ప్రారంభించింది. ఇందులోని గెయిట్ అనాలసిస్ ల్యాబ్‌ను చారిటబుల్ ఎండోమెంట్స్ శాఖ మంత్రి కె.శేఖర్‌బాబు ప్రారంభించగా, దివంగత రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా విగ్రహాన్ని రేఖా ఝున్‌ఝున్‌వాలా( Rekha Jhunjhunwala) ఆవిష్కరించారు. అలాగే, హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ (HBOT), ఆపరేషన్ థియేటర్, ఐసీయూ కాంప్లెక్స్‌లను కూడా ఆమె ప్రారంభించారు. పొడియాట్రీ ఇనిస్టిట్యూట్, అంప్యుటేషన్ సెంటర్ ప్రివెన్షన్ సెంటర్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ రాజేశ్ కేశవన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేఖా ఝున్‌ఝున్‌వాలా మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇనిస్టిట్యూట్‌లు తన భర్త పాదాలను తొలగించాల్సిందేనని చెప్పాయని, కానీ, డాక్టర్ రాజేశ్ కేశవన్ ఆ అవసరం లేకుండానే నయం చేశారని గుర్తు చేసుకున్నారు. డయాబెటిక్ ఫుట్‌కేర్ రంగంలో ఆయన ప్రతిభ అసామాన్యమని కొనియాడారు. ఈ ప్రపంచ శ్రేణి చికిత్సను ప్రతీ భారతీయునికీ చేరువ చేయాలని తన భర్త పరితపించారని, అందుకనే డాక్టర్ కేశవన్‌తో కలిసి ఈ ప్రపంచ శ్రేణి ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించినట్టు చెప్పారు.
డాక్టర్ రాజేశ్ కేశవన్(Dr. Rajesh Kesavan) మాట్లాడుతూ.. ఫుట్, పొడియాట్రిక్ కేర్ అనే పదం ప్రత్యేకమైన వైద్య చికిత్సను సూచిస్తుందన్నారు. పొడియాట్రిస్ట్, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సహా సుశిక్షితులైన నిపుణులు మాత్రమే ఈ తరహా సేవలను అందించగలరన్నారు. డయాబెటిక్ ఫుట్‌పై ప్రజలకు అవగాహన కల్పించి, వ్యాధి తీవ్రతను ముందుగానే గుర్తించడం ద్వారా వైకల్యం నుంచి నిరోధించవచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట ప్రతి ఏడు సెకన్లకు ఓ అవయవాన్ని తొలగిస్తున్నట్టు చెప్పారు. దేశంలో దాదాపు 6 కోట్ల మంది మధుమేహ రోగులు ఉన్నారని, వీరిలో చాలామంది పాదాలలో స్పర్శ కోల్పోతున్నారని అన్నారు.
Updated Date - 2023-01-08T16:53:27+05:30 IST