ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Financial deadlines: బీ అలర్ట్..! ఆర్థికపరంగా దగ్గరపడ్డ ముఖ్యమైన డెడ్‌లైన్స్.. ఎవరిపై ఏవిధంగా ప్రభావం ఉంటుందంటే?

ABN, First Publish Date - 2023-06-05T12:54:04+05:30

ప్రస్తుత జూన్ నెలలో కూడా కొన్ని కీలకమైన ఆర్థిక వ్యవహారాల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యంగా కొన్నింటి గడువుకాలం ముగిసిపోనుంది. ఈ మార్పులు వేతన జీవుల నుంచి పన్ను చెల్లింపుదారుల వరకు పలు వర్గాలపై ప్రభావం చూపించనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్థిక సంబంధ వ్యవహారాలు (Financial matters) కాలానికి అనుగుణంగా మారుతుంటాయి. ప్రభుత్వాలు లేదా అనుబంధ సంస్థలు, ఆర్థిక కార్యకలాపాలతో ముడిపడిన బ్యాంకులు, ఇతర విభాగాలు చేపట్టే నూతన మార్పులకు అనుగుణంగా నిబంధనలు అమల్లోకి వస్తుంటాయి. ఎప్పటిలాగానే ప్రస్తుత జూన్ నెలలో కూడా కొన్ని కీలకమైన ఆర్థిక వ్యవహారాల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యంగా కొన్నింటి గడువుకాలం ముగిసిపోనుంది. ఈ మార్పులు వేతన జీవుల నుంచి పన్ను చెల్లింపుదారుల వరకు పలు వర్గాలపై ప్రభావం చూపించనున్నాయి. కాబట్టి జూన్‌లో ముగిసిపోనున్న ఈ డెడ్‌లైన్స్ గురించి అవగాహనతో ఉండడం మంచిది. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మోనిటరీ పెనాల్టీలు, అకౌంట్ డీయాక్టివేషన్ వంటి పరిణామాలకు గురయినా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. కాబట్టి జూన్‌లో ముగిసిపోనున్న కీలకమైన గడువు తేదీలు ఏంటో ఒకసారి గమనిద్దాం...

పాన్-ఆధార్ లింకింగ్..

పాన్ కార్డ్ - ఆధార్ అనుసంధానానికి జూన్ 30, 2023 తుది గడువుగా ఉంది. వాస్తవానికి మార్చి 31నే ముగియాల్సిన ఈ గడువుని జూన్ 30 వరకు ప్రభుత్వం పొడగించింది. కాబట్టి ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్ కార్డులు జులై 1 నుంచి నిరుపయోగంగా మారిపోతాయి. మరో విషయం ఏంటంటే పాన్-ఆధార్ లింకింగ్‌కు ప్రస్తుతం జూన్ 30 వరకు గడువు ఉన్నప్పటికీ రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక పాన్-ఆధార్ లింకవ్వకపోతే చెల్లింపుదారులు పన్ను ప్రయోజనాలు కూడా పొందలేరు.

ఈపీఎఫ్ కింద అధిక పెన్షన్ గడువు...

ఈపీఎఫ్ (EPF) చందాదారులు జూన్ 26 తర్వాత అధిక పెన్షన్‌కు అప్లై చేసుకునే అవకాశం ఉండదు. ఇప్పటికే మే నెలలోనే ముగియాల్సిన తేదీని జూన్ 26 వరకు ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే.

బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్...

లాకర్ కలిగివున్నవారి ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా దశలవారీగా నూతన లాకర్ అగ్రిమెంట్‌పై వినియోగదారులతో సంతకం చేయించాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. అయితే 50 శాతం మంది కస్టమర్లను అగ్రిమెంట్‌పై సంతకం పెట్టించేందుకు జూన్ 30వ తేదీ, ఇక 75 శాతం మంది కస్టమర్లకు గడువు సెప్టెంబర్ 30గా గడువుగా ఉన్నాయి.

ఉచితంగా ఆధార్ అప్‌డేట్...

ఆధార్ కలిగివున్న వ్యక్తులు ఎవరైనా ఉచితంగా ఆన్‌లైన్ అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందుకు జూన్ 14 చివరి తేదీగా ఉంది. ఆ తర్వాత చేసుకునేవారు రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10 వేల కంటే ఎక్కువ ట్యాక్స్ చెల్లించాల్సిన వ్యక్తులు ఈ ఏడాది అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇన్‌స్టాల్‌మెంట్లలో చెల్లించే ఆప్షన్ ఉంటుంది. అయితే తొలి 15 శాతం ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించేందుకు గడువు తేదీ జూన్ 15గా ఉంది.

Updated Date - 2023-06-05T13:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising