SBI: ఎస్‌బీఐ అకౌంట్ బ్రాంచ్ మారాలనుకుంటున్నారా? ఇంటి దగ్గరే కూర్చొని ఇలా చేసేయండి చాలు..
ABN, First Publish Date - 2023-03-16T18:14:03+05:30
ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి రావడం, బ్యాంకులకు సంబంధించిన అత్యధిక సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులో లభ్యమవుతుండడంతో బ్యాంక్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం సులభతరమైంది. ఎలా చేయాలంటే...
ముంబై: ఎస్‌బీఐ (SBI) దేశంలోనే అతిపెద్ద కమర్షియల్ బ్యాంక్. కోట్లాది మంది కస్టమర్లకు ( వేర్వేరు సర్వీసులు అందిస్తోంది. 24,000 బ్రాంచులతో దేశవ్యాప్తంగా భారీ నెట్‌వర్క్‌ను కలిగివుంది. కాగా చాలామంది కస్టమర్లు తాము నివాసముంటున్న ప్రాంతానికి సమీపంలో బ్యాంక్ బ్రాంచ్ ఉంటే సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తుంటారు. అలాంటివారిలో ఎక్కువమంది ఎస్‌బీఐ ఎంచుకుంటుంటారు. అయితే అవసర నిమిత్తం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నివాసం మారినప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటప్పుడు కస్టమర్లు తమ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం అత్యుత్తమ మార్గం. ఇదివరకు అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం సంక్లిష్టమైన ప్రక్రియగా ఉండేది. బ్రాంచ్‌కు వెళ్లి.. చాలా ఫామ్స్ నింపి.. క్యూ నిలుచొని వాటన్నింటిని అందించి.. కొన్ని రోజులపాటు వేచిచూసిన తర్వాత అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అయ్యేది. కానీ ప్రస్తుతం ఎస్‌బీఐ కస్టమర్లు (SBI Customers) ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే సులభంగా పూర్తి చేయవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి రావడం, బ్యాంకులకు సంబంధించిన అత్యధిక సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులో లభ్యమవుతుండడంతో బ్యాంక్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం సులభతరమైంది. మరి ఆ ప్రక్రియను ఏవిధంగా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్ మీరూ తెలుసుకోండి..
రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ కలిగివున్న ఎస్‌బీఐ కస్టమర్లు ఆన్‌లైన్‌లోనే అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
ఇలా చేయండి..
Step 1: ఎస్‌బీఐ అఫీషియల్ వెబ్‌సైట్ www.onlinesbi.com. ఓపెన్ చేయాలి.
Step 2: లాగిన్ క్రెడెన్షియల్స్‌తో నెట్ బ్యాంకింగ్‌లోకి యాక్సెస్ అవ్వాలి. ఫస్ట్ టైమ్ యూజర్లు అయితే లాగిన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది.
Step 3: లాగిన్ అయిన తర్వాత ‘ఈ-సర్వీసెస్’ మీద ట్యాప్ చేయాలి.
Step 4: కింద కనిపించే క్విక్ లింక్స్‌లో ‘ట్రాన్స్‌ఫర్ ఆఫ్ సేవింగ్ అకౌంట్’పై క్లిక్ చేయాలి.
Step 5: ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఎస్‌బీఐ అకౌంట్ మాత్రమే ఉంటే దానంతట అదే సెలక్ట్ అవుతుంది.
Step 6: అకౌంట్ ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ కోడ్ ఎంటర్ చేయాలి.
Step 7: ‘get branch code’పై క్లిక్ చేసి బ్రాంచ్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.
Step 8: అవసరమైన ఫీల్డ్స్‌లో కొత్త బ్రాంచ్ పేరు ఎంటర్ చేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను యాక్సెప్ట్ చేస్తూ సబ్మిట్‌పై (Submit) క్లిక్ చేయాలి.
Step 9: రిజిష్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తే బ్రాంచ్ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన రిక్వెస్ట్ రిజిష్టర్ అవుతుంది.
Step 10: కొన్ని రోజుల వ్యవధిలోనే అకౌంట్ ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది.
Updated Date - 2023-03-16T18:14:03+05:30 IST