ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TCS: టీసీఎస్ కీలక నిర్ణయం ! ఉద్యోగులపై ఎఫెక్ట్..

ABN, First Publish Date - 2023-01-13T12:58:03+05:30

ఇంతకాలం వర్క్ ఫ్రం హోమ్ (Work from Home) విధానంలో పనిచేసిన ఐటీ దిగ్గజం టీసీఎస్(TCS) ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్!. వర్క్ ఫ్రం హోమ్‌ విధానానికి సంపూర్ణంగా ముగింపు పలుకుతున్నట్టు కంపెనీ తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఇంతకాలం వర్క్ ఫ్రం హోమ్ (Work from Home) విధానంలో పనిచేసిన ఐటీ దిగ్గజం టీసీఎస్(TCS) ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్!. వర్క్ ఫ్రం హోమ్‌ విధానానికి సంపూర్ణంగా ముగింపు పలుకుతున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రతిఒక్కరూ తిరిగి ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని స్పష్టంచేసింది. టీసీఎస్ సీవోవో (Chief Operating Officer) ఎన్ గణపతి సుబ్రమణియమ్ (Ganapathy Subramaniam) ఇటివల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘‘ ఆఫీస్‌కు వచ్చి పనిచేస్తే ఉద్యోగులకు మరిన్ని విషయాలు అనుభవపూర్వకంగా తెలుస్తాయి. చాలా పనులు జరుగుతాయి. ముఖ్యంగా గత రెండేళ్లకాలంలో చేరిన ఉద్యోగులకు ఈ అనుభవం చాలా అవశ్యం. కొత్త ఉద్యోగులు ఆఫీస్‌లకు వస్తే టీసీఎస్ విభిన్న కోణంలో అర్థమవుతుంది. వారివారి పాత్రలు ఏంటనేవి ఉద్యోగులకు తెలుస్తాయి’’ అని ఆయన తెలిపారు.

ఆఫీస్ (Office) నుంచి పనిచేయాలనుకుంటున్న ఉద్యోగుల (Employees) సాధారణ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని పర్మినెంట్ వర్క్ ఫ్రం హోమ్‌ను పూర్తిగా రద్దు చేస్తోందని ఎన్.గణపతి సుబ్రమణియమ్ వివరించారు. ప్రపంచంలోని పలు దేశాల్లో కొవిడ్ కేసులు (Covid cases) పెరుగుతున్న దృష్ట్యా ఆఫీసుల్లో తగిన జాగ్రత్త చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు తగిన వెసులుబాటు కల్పిస్తామని, అయినప్పటికీ హైబ్రీడ్ వర్క్ విధానాన్ని అలవరచుకోవాల్సి ఉందన్నారు. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్‌ను 100 శాతం రద్దు చేస్తున్నామని గణపతి సుబ్రమణియమ్ చెప్పారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పటి నుంచి పూర్తిగా రద్దవుతుందనే వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా వారంలో కనీసం మూడు రోజులైనా ఆఫీస్ నుంచి పనిచేయాలంటూ ఉద్యోగులందరికీ గతేడాది ఈ-మెయిల్ ద్వారా కంపెనీ సమాచారమిచ్చింది. టీమ్ సూపర్‌వైజర్ నిర్ణయించే రోస్టర్ ప్రకారం వచ్చి ఆఫీస్‌లో పనిచేయాలని తెలిపిన విషయం తెలిసిందే. టీసీఎస్ సీనియర్లు కొంతకాలంగా ఆఫీస్ నుంచి పనిచేస్తుండడంతో కస్టమర్ల కూడా కార్యాలయాలను సందర్శిస్తున్నారని ఈ-మెయిల్స్‌లో వివరించింది. అంతకుముందు 2020 మే నెలలో కొవిడ్ పరిస్థితి దృష్ట్యా టీసీఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని పరిచడం చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-01-13T13:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising