ACP Bharat Gaikwad: భార్య, మేనల్లుడిని కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్న ఏసీపీ.. అసలు ఏం జరిగిదంటే..?
ABN, First Publish Date - 2023-07-24T18:40:46+05:30
మహారాష్ట్రలోని పూణెలో విషాదం చోటు చేసుకుంది. ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ తన సర్వీస్ రివాల్వర్‌తో భార్య, మేనల్లుడిని( Wife And Nephew) కాల్చి చంపి, ఆపై తాను కూడా కాల్చుకుని చనిపోయాడు. బానర్ ప్రాంతంలోని ఏసీపీ భరత్ గైక్వాడ్ బంగ్లా(ACP Bharat Gaikwad's bungalow) వద్ద వేకువజామున 3:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
మహారాష్ట్రలోని పూణెలో విషాదం చోటు చేసుకుంది. ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ తన సర్వీస్ రివాల్వర్‌తో భార్య, మేనల్లుడిని( Wife And Nephew) కాల్చి చంపి, ఆపై తాను కూడా కాల్చుకుని చనిపోయాడు. బానర్ ప్రాంతంలోని ఏసీపీ భరత్ గైక్వాడ్ బంగ్లా(ACP Bharat Gaikwad's bungalow) వద్ద వేకువజామున 3:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఈ సంఘటన సంచలనంగా మారింది. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 57 ఏళ్ల భరత్ గైక్వాడ్ అనే వ్యక్తి అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP)గా విధులు నిర్వర్తిస్తున్నారు. అమరావతి ఏసీపీగా పని చేస్తున్న భరత్ గైక్వాడ్ విధులు ముగించుకుని ఇంటికి వచ్చాకే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో తన భార్య మోని(44)ని తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చాడు. తుపాకీ శబ్దం వినగానే కొడుకు, మేనల్లుడు పరిగెత్తుకుంటూ వచ్చి తలుపులు తెరిచారు. వారు తలుపులు తెరిచిన వెంటనే ఏసీపీ తన మేనల్లుడు దీపక్(35)పై కాల్పులు జరిపాడు. బుల్లెట్ దీపక్ ఛాతిలోకి దూసుకుపోయింది. ఆ తర్వాత తనకు తానుగా తన తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదని చతుర్‌శృంగి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఘటన గురించి కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్టు చెప్పారు. కేసు నమోదు చేసి ఘటనకు గల కారణాలు తెలుసుకోవడానికి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - 2023-07-24T18:40:46+05:30 IST