ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Education: నాడు-నేడుకు ‘పీజీ’ నిధులు!

ABN, First Publish Date - 2023-11-13T11:19:25+05:30

మెడికల్‌ కాలేజీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేసినా డీఎంఈతోనే సంప్రదింపులు జరుపుతుంది. అయితే, ఈ మధ్య కాలంలో ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు డీఎంఈతో సంబంధం లేకుండా నిర్ణయాలు

  • కేంద్రం ఇచ్చిన 756 కోట్లు మళ్లింపు

  • ఆ నిధులతో పనులకు సర్కారు ఓకే

  • ఫలితంగా పీజీ సీట్లపై రద్దు పిడుగు

  • ‘నాడు-నేడు’ పనులకు రాష్ట్ర నిధులే

  • ఖర్చు చేస్తామని గతంలో సీఎం వెల్లడి

  • కానీ, ఇప్పుడు మడమ తిప్పేసిన జగన్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి): నిధుల మళ్లింపు, దుర్వినియోగంలో వైసీపీ ప్రభుత్వం (Ycp Government) ముందంజలో ఉంది. ఆ పథకం.. ఈ పథకం అంటూ శాఖలకు చెందిన నిధులను ఇష్టారాజ్యాంగా మళ్లిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్యశాఖకు చెందిన నిధులు అయితే ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుని, ఆ తర్వాత తనకు నచ్చినప్పుడు, నిధులున్నప్పుడు ఇస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు వాడేసుకోవడం పరిపాటిగా మారింది. ఆరోగ్యశాఖలో ప్రభుత్వం చేపట్టిన పనుల్లో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం, పాత కాలేజీల్లో ‘నాడు-నేడు’ ఉన్నాయి. కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే చేపడతామని గతంలో చెప్పిన సీఎం జగన్‌.. తర్వాత మొత్తం నిధులను కేంద్రం నుంచి రాబట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. 17 మెడికల్‌ కాలేజీల్లో మూడు కళాశాలలకు కేంద్రమే నిధులు ఇచ్చింది. పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో ఏర్పాటు చేస్తున్న వాటికి మంజూరు చేసింది. మిగిలిన 14 కాలేజీలకు కూడా కేంద్రం నుంచే నిధులు రాబట్టేలా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలావుంటే, ఆరోగ్యశాఖలో మరో కీలకమైన పథకం నాడు-నేడు. రాష్ట్రంలోని 11 మెడికల్‌ కాలేజీల రూపురేఖలు మార్చేస్తామని గతంలో సీఎం చెప్పుకొచ్చారు.

ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కానీ, ఎన్నికలు దగ్గర పడడంతో నిధుల కోసం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వేట ప్రారంభించారు. 11 పాత మెడికల్‌ కాలేజీల్లో నాడు-నేడు పనుల కోసం రూ.3,820 కోట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనులకు ఇప్పటికే కాంట్రాక్టర్లను కూడా ఏపీఎంఎ్‌సఐడీసీ ఎంపిక చేసింది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో నాడు-నాడుకు సంబంధించిన అన్ని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కానీ, నిధుల కొరతతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం ఇచ్చిన ఓ అవకాశాన్ని వైసీపీ ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుంది. రాష్ట్రంలో ఉన్న పాత మెడికల్‌ కాలేజీలకు కొత్తగా దాదాపు 600పైన పీజీ సీట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో పాటు వాటి కోసం రూ.756 కోట్ల నిధులు కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద 60:40 నిష్పత్తిలో ఈ నిధులు విడుదల చేస్తుంది. 60ు నిధులు కేంద్రం ఇస్తే 40ు నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ నిధులు మొత్తం పీజీ సీట్లకు అవసరమైన మౌలిక సదుపాయాలకు మాత్రమే ఖర్చు చేయాలి. మరో పథకానికి ఆ నిధులు మళ్లించడానికి వీల్లేదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలను పక్కన పెట్టేసింది. రూ.756 కోట్లను నాడు-నేడు పథకానికి ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. శుక్రవారం దీనికి సంబంధించిన జీవోను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.

డీపీఆర్‌లు ఇచ్చి కూడా

నిబంధనల ప్రకారం ఏ పథకానికి కేటాయించిన నిధులను ఆ పథకానికే వినియోగించాలి. 11 మెడికల్‌ కాలేజీల్లో కొత్త పీజీ సీట్ల కోసం డీఎంఈ అధికారులు కేంద్రానికి దరఖాస్తు చేసినప్పుడు డీపీఆర్‌లు అందించారు. ప్రతి కాలేజీ ప్రిన్సిపాల్‌ ఢిల్లీ వెళ్లి మరీ కొత్తగా కేటాయించిన సీట్ల కోసం ఏయే పనులు చేయనున్నారనో డీపీఆర్‌ రూపంలో కేంద్రానికి వివరించారు. కేంద్రం కూడా ఈ డీపీఆర్‌లను పరిశీలించిన తర్వాతే పీజీ సీట్లు కేటాయించడంతో పాటు, మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులు ఇచ్చింది. ఉదాహరణకు నెల్లూరులో రేడియాలజీ సీట్లు కేటాయించిన కేంద్రం, దానికి అవసరమైన సీటీ స్కాన్‌ మిషన్‌కు నిధులు కేటాయించింది. ఈ నిధులు వాటి కోసమే ఉపయోగించాలి. అంతేకాదు, కేంద్రం ఇచ్చిన నిధులతో ఏ పనులు చేశారు? ఎలాంటి పరికరాలు కొన్నారన్న దానిపై ఎప్పటికప్పుడు యూసీలు అందించాలి. ఇప్పటికే కేంద్రం పీజీ సీట్లకు సంబంధించిన తొలి విడతలో రూ.186 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన యూసీలు కేంద్రానికి అందిస్తేనే తదుపరి నిధులు విడుదలవుతాయి. ప్రిన్సిపాల్స్‌ ఇచ్చిన డీపీఆర్‌ ప్రకారం నిధులు ఖర్చు చేయకుంటే కేంద్రం నిధులు నిలిపివేయడంతో పాటు పీజీ సీట్లు కూడా రద్దు చేసే ప్రమాదముంది. డీఎంఈ, ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు ఇవేవీ పట్టించుకోకుండా వచ్చిన నిదులు వచ్చినట్లు నాడు-నేడుకు మళ్లించుకునేలా జీవో విడుదల చేయించారు.

అదీ-ఇదీ ఒకటేనా?!

ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. నిధులు మళ్లింపు విషయాన్ని పక్కన పెట్టి, నాడు-నేడు, పీజీ సీట్ల పెంపునకు అవసరమైన మౌలిక సదుపాయల కల్పనను ఒకే పని కింద పరిగణిస్తున్నారు. నాడు-నేడులో ఏం చేస్తారో, పీజీ సీట్ల పెంపులో కూడా అవే పనులు చేస్తాం కాబట్టి రెండు పనులను ఒకే విధంగా పరిగణిస్తున్నామనే వాదనను వినిపిస్తున్నారు. నాడు-నేడు పనులను ఏపీఎంఎ్‌సఐడీసీ ఇప్పటికే 5 కాంట్రాక్ట్‌ సంస్థలకు పనులు కేటాయించింది. వాటి విలువ రూ.3,820 కోట్ల వరకు ఉంది. ఇప్పుడు కొత్తగా చేపట్టే నాడు-నేడు పనులను కూడా పాత కాంట్రాక్టర్లకే ఇవ్వాలని ఏపీఎంఎ్‌సడీసీ నిర్ణయించింది. పీజీ సీట్ల పెంపుకోసం విడుదలైన నిధులు, ఆ పనులను కూడా పాత కాంట్రాక్టర్లకే ఇవ్వనున్నారు. ఒకే పనికి రెండు పథకాల కింద వచ్చిన నిధులను ఉపయోగించడం పెద్ద తప్పిదమేనని నిపుణులు అంటున్నారు. దీనిపై కేంద్రం దృష్టి పెడితే పీజీ సీట్లు మొత్తం రద్దయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

సంబంధం లేని నిర్ణయాలు

మెడికల్‌ కాలేజీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేసినా డీఎంఈతోనే సంప్రదింపులు జరుపుతుంది. అయితే, ఈ మధ్య కాలంలో ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు డీఎంఈతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిధుల విషయంలో డీఎంఈకి ఎలాంటి సమాచారం లేకుండాఫైల్స్‌ను నేరుగా ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి పంపించి, అక్కడ నుంచి అనుమతి తీసుకుంటున్నారు. కానీ, డీఎంఈకి మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. నిబంధనల ప్రకారం ఏపీఎంఎ్‌సఐడీసీకి ఏం కావాలన్నా డీఎంఈ ద్వారా ఫైల్స్‌ ప్రభుత్వానికి వెళ్లాలి. అయితే, ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు నిబంధనలు పక్కన పెట్టి డీఎంఈతో సంబంధం లేకుండా జీవోలు తెప్పించుకుంటున్నారు.

Updated Date - 2023-11-13T11:19:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising