ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Education: సీబీఎస్‌ఈ పాయె! స్థిరత్వం లేని ప్రభుత్వ విధానంతో విద్యార్థులకు ఇబ్బందులు!

ABN, First Publish Date - 2023-07-19T11:53:53+05:30

ఉత్తుత్తి బటన్లు నొక్కినట్టే.. ఉత్తుత్తి హామీలివ్వడం ఆపై చేతులెత్తేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి పరిపాటిగా మారింది! ఏడాదికో సంస్కరణ పేరుతో స్కూళ్లను భ్రష్ఠు పట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అధికారంలోకి రాగానే ఇంగ్లీషు మీడియం అంటూ ఊదరగొట్టింది.

ప్రస్తుతం 1092 పాఠశాలలకే గుర్తింపు

2024 నాటికి 45 వేల స్కూళ్లు లక్ష్యం

ఈ ఏడాది ఒక్క స్కూలుకూ దక్కని వైనం

ప్రమాణాల్లేవని తిరస్కరించిన కేంద్రం!

ఇప్పుడు తెరపైకి అంతర్జాతీయ సిలబస్‌

సీబీఎస్‌ఈకే దిక్కు లేకపోతే అదెలా సాధ్యం?

గతేడాది బైజూస్‌ అంటూ హడావిడి

ఏడాదికో పాట పాడుతున్న ప్రభుత్వం

ఉత్తుత్తి బటన్లు నొక్కినట్టే.. ఉత్తుత్తి హామీలివ్వడం ఆపై చేతులెత్తేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి (CM Jagan) పరిపాటిగా మారింది! ఏడాదికో సంస్కరణ పేరుతో స్కూళ్లను భ్రష్ఠు పట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అధికారంలోకి రాగానే ఇంగ్లీషు మీడియం అంటూ ఊదరగొట్టింది. 2024 నాటికల్లా రాష్ట్రంలోని 45 వేల పాఠశాలలనూ సీబీఎస్‌ఈగా మార్చేస్తామని తెగ ప్రచారం చేసేసింది. పోనీ దీన్నయినా చిత్తశుద్ధిగా చేసిందా అంటే అదీలేదు. ఇప్పటివరకూ 1092 పాఠశాలలకే గుర్తింపు సాధించగలిగింది. ఇప్పుడు కొత్తగా అంతర్జాతీయ సిలబస్‌ రాగం అందుకుని మరో మోసానికి తెరలేపుతోంది!

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యా రంగాన్ని వైసీపీ ప్రభుత్వం (YCP Government) పూర్తిస్థాయి ప్రయోగశాలగా మార్చేసింది. ఏడాదికో సంస్కరణ పేరుతో పాఠశాలలను ఎటూ కాకుండా చేస్తోంది. గతేడాది వరకూ సీబీఎస్‌ఈ (CBSE) అంటూ ప్రచారం చేసిన ప్రభుత్వం దానిని సాధించలేక, ఇప్పుడు కొత్తగా అంతర్జాతీయ సిలబస్‌ అంటూ కొత్త పల్లవి అందుకుంది. 2022-23లో రాష్ట్రంలోని 1,092 ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎ్‌స ఈ అఫిలియేషన్‌ లభించింది. రాష్ట్రంలో మొత్తం 6,684 ఉన్నత పాఠశాలలుండగా, ఇంకా 5,594 పాఠశాలలకు సీబీఎ్‌సఈ గుర్తింపు దక్కాల్సి ఉంది. వాటికి గుర్తింపు ఇవ్వాలని కోరుతూ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కేంద్ర విద్యామంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. అయితే సీబీఎ్‌సఈకి అర్హత సాధించే ప్రమాణాలు ఈ పాఠశాలల్లో లేనందున వాటి నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కానీ, దేశమంతా ఒక్కటే విధానం ఉండటంతో కేంద్రం మినహాయింపు ఇచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇప్పటివరకూ అదనంగా ఒక్క పాఠశాలకు కూడా గుర్తింపు లభించలేదు. సీబీఎస్‌ఈకి అర్హత సాధించే ప్రమాణాలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో లేవని తిరస్కరించినట్లు తెలిసింది. 2024 నాటికి మొత్తం 45 వేల పాఠశాలలను సీబీఎస్‌ఈలోకి మార్చాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకోగా... ఆ లక్ష్యం చేరుకునే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో అకస్మాత్తుగా అంతర్జాతీయ సిలబస్‌ (ఐబీ) ప్రవేశపెడతామంటూ ఇటీవల సీఎం జగన్‌ ప్రకటించారు. అంటే సీబీఎ్‌సఈ ఇక అక్కర్లేదని, ఇకపై అంతర్జాతీయ సిలబ్‌సకే ప్రాధాన్యమని ప్రభుత్వం తేల్చేసింది. అయితే కేంద్రస్థాయిలోని సీబీఎస్‌ఈకే దిక్కు లేకపోతే అంతర్జాతీయ సిలబస్‌ ఎలా అమలుచేస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ లక్ష్యం..

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక దశల వారీగా ప్రభుత్వ పాఠశాలలను సీబీఎస్‌ఈలోకి మారుస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. 2021-22 విద్యా సంవత్సరంలో 1 నుంచి 7 తరగతుల వరకు ఉన్న పాఠశాలలను సీబీఎస్‌ఈలోకి మార్చాలని, ఆ తర్వాత ఏడాదికో తరగతి చొప్పున పెంచుకుంటూ పోయి 2024 నాటికి మొత్తం 45వేల పాఠశాలలను సీబీఎ్‌సఈలోకి మారుస్తామని తెలిపారు. కానీ సీబీఎ్‌సఈ అర్హత సాధించే ప్రమాణాలు ప్రభుత్వ పాఠశాలల్లో లేకపోవడంతో గుర్తింపు పొందడం సాధ్యం కాలేదు. 2022-23 విద్యా సంవత్సరంలో 1092 ఉన్నత పాఠశాలలకు మాత్రమే గుర్తింపు లభించింది. మరొక్క సంవత్సరంలో మిగిలిన 44 వేల స్కూళ్లకు సీబీఎ్‌సఈ గుర్తింపు వస్తుందా..? అనేది ప్రభుత్వమే చెప్పాలి.

ఇవి ఉంటేనే సీబీఎస్‌ఈ గుర్తింపు

  • తరగతి గది కనీసం 500 చదరపు అడుగుల్లో ఉండాలి. ఒక్కో విద్యార్థికి ఒక చదరపు మీటర్‌ విస్తీర్ణం కేటాయించాలి.

  • అవసరమైన ఉపకరణాలతో 600 చదరపు అడుగుల్లో సైన్స్‌ లేబొరేటరీ ఉండాలి.

  • ల్రైబరీ కచ్చితంగా ఉండాలి. వయస్సుల వారీగా విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. ఈ-పుస్తకాలు, ఫిక్షన్‌, నాన్‌ ఫిక్షన్‌, రిఫరెన్స్‌ పుస్తకాలు, ఎన్‌సైక్లోపీడియా, పీరియాడికల్స్‌, మేగజైన్స్‌, జర్నల్స్‌, వార్తా పత్రికలు తప్పనిసరిగా ఉండాలి. వీటికోసం తగినంత బడ్జెట్‌ కేటాయించాలి.

  • 600 చదరపు అడుగుల్లో కంప్యూటర్‌ లేబొరేటరీ ఉండాలి. ప్రతి పాఠశాలకు కనీసం 20 కంప్యూటర్లు ఉండాలి. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తప్పనిసరి.

  • సాధారణ తరగతి గది స్థాయిలో ప్రత్యేకంగా మేథమేటిక్స్‌ లేబొరేటరీ ఉండాలి.

  • తాగునీటి సదుపాయం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉండాలి. తరగతి గదుల్లో తగిన ఫర్నిచర్‌ ఉండాలి. క్రీడా ప్రాంగణం తప్పనిసరి.

  • దివ్యాంగ విద్యార్థులకు టాయిలెట్లు, తాగునీరు, కుర్చీలు ప్రత్యేంగా ఉండాలి.

స్థిరత్వం లేని విధానం

సాధారణంగా విద్యా రంగంలో సంస్కరణలు ప్రస్తుత విధానాలను మెరుగుపర్చే విధంగా ఉండాలి తప్ప ఏకంగా మొత్తం వ్యవస్థనే మార్చేలా ఉండకూడదు. గతేడాది ఎనిమిదో తరగతిలో పరిమిత పాఠశాలల్లో సీబీఎ్‌సఈ అందుబాటులోకి తీసుకురాగా.. గుర్తింపు లేకపోయినా ఈ ఏడాది ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలనే 6, 7, 9 తరగతులకు పంపిణీ చేశారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు సీబీఎ్‌సఈని వదిలేసి అంతర్జాతీయ సిలబస్‌ అని కొత్త విధానాన్ని తలకెత్తుకున్నారు. వాస్తవానికి అంతర్జాతీయ సిలబ్‌సపై ఇప్పటికీ అధికారులకే స్పష్టత లేదు. కానీ వారితో సంబంధం లేకుండా సీఎం జగన్‌ ఏకపక్షంగా అంతర్జాతీయ సిలబస్‌ తెస్తామని ప్రకటించారు. గతేడాది అంతా బైజూస్‌ కంటెంట్‌ అంటూ హడావిడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఈ కొత్త విధానం వైపు ఎందుకు వెళ్తుందో అర్థం కావట్లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. పాఠశాలల్లో కనీస వసతులు లేకుండా ఇలా అంతర్జాతీయ సిలబ్‌సలు తేవాలని ప్రయత్నాలు చేయడం ఏమిటంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-07-19T11:56:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising