Notification: హైదరాబాద్ నల్సార్ వర్సిటీలో ప్రవేశాలు.. అడ్మిషన్స్ ఇలా పొందవచ్చు..!
ABN, First Publish Date - 2023-07-21T17:48:35+05:30
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(నల్సార్-డీడీఈ)- ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(నల్సార్-డీడీఈ)- ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఏ ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. గరిష్ఠంగా నాలుగేళ్లలో పూర్తిచేయాలి. అడ్వాన్స్‌డ్ డిప్లొమా వ్యవధి ఏడాది. గరిష్ఠంగా రెండేళ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్‌లను ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్‌లో నిర్వహిస్తారు. ప్రోగ్రామ్‌లలో భాగంగా ఆన్‌లైన్ సెషన్స్, కాంటాక్ట్ ప్రోగ్రామ్స్, ప్రొఫెషనల్ అసైన్‌మెంట్స్ ఉంటాయి. వార్షిక పరీక్షలను నల్సార్ క్యాంపస్‌లో ఫిజికల్ మోడ్‌లో నిర్వహిస్తారు. ఈ ప్రోగ్రామ్‌లకు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా అప్లయ్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ నేరుగా అడ్మిషన్స్ ఇస్తారు.
ఎంఏ స్పెషలైజేషన్‌లు
ఫ ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ లాస్, స్పేస్ అండ్ టెలీకమ్యూనికేషన్ లాస్, మ్యారీటైం లాస్, క్రిమినల్ లా అండ్ ఫోరెన్సిక్ సైన్స్, ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్, యానిమల్ ప్రొటెక్షన్ లాస్, కార్పొరేట్ లా
ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, మ్యారీటైం లాస్, క్రిమినల్ లా అండ్ ఫోరెన్సిక్ సైన్స్, యానిమల్ ప్రొటెక్షన్ లాస్, కార్పొరేట్ లా అభ్యర్థులు మొదటి ఏడాది కోర్సు పూర్తిచేసిన తరవాత ప్రోగ్రామ్ నుంచి వైదొలగే వీలుంది. వీరికి సంబంధిత స్పెషలైజేషన్‌తో అడ్వాన్స్‌డ్ డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తారు.
అడ్వాన్స్‌డ్ డిప్లొమా స్పెషలైజేషన్‌లు: పేటెంట్స్ లా, సైబర్ లాస్, మీడియా లాస్, ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్, ఫ్యామిలీ డిస్ప్యూట్ రిజల్యూషన్, డ్రాఫ్టింగ్, నెగోషియేషన్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్స్, కార్పొరేట్ ట్యాక్సేషన్, లేబర్ లాస్ అండ్ ఎంప్లాయీ మేనేజ్‌మెంట్, ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, జీఐఎస్ అండ్ రిమోట్ సెన్సింగ్ లాస్, మ్యారీటైం లాస్, క్రిమినల్ లా అండ్ ఫోరెన్సిక్ సైన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ లెజిస్లేషన్స్, యానిమల్ ప్రొటెక్షన్ లాస్, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా ప్రొటెక్షన్ లాస్, కార్పొరేట్ లా.
అర్హత వివరాలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్‌కు మూడేళ్ల డిగ్రీ/డిప్లొమా ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్(ఏఎంఈ); ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ లెజిస్లేషన్స్ స్పెషలైజేషన్‌లకు ఐసీఎ్‌సఐ, ఐసీఏఐ, ఐసీఎంఏఐ మెంబర్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 10
వెబ్‌సైట్: www.dde.nalsar.ac.in
Updated Date - 2023-07-21T17:48:35+05:30 IST