ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Edset Notification: ఫైనలియర్ అభ్యర్థులు కూడా అర్హులే

ABN, First Publish Date - 2023-03-29T13:05:21+05:30

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) - ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఎడ్‌సెట్‌) 2023 నోటిఫికేషన్‌ను విడుదల

AP Edset Notification
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) - ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఎడ్‌సెట్‌) 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిని విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ ఎగ్జామ్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా బీఈడీ రెగ్యులర్‌ కోర్సు, బీఈడీ(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వ/ ప్రైవేట్‌/ ఎయిడెడ్‌ కళాశాలల్లో అడ్మిషన్స్‌ ఇస్తారు.

అర్హత వివరాలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో బీఏ/ బీఎస్సీ/ బీఎస్సీ(హోం సైన్స్‌)/ బీకాం/ బీసీఏ/ బీబీఎం ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు కూడా అర్హులే. సంబంధిత సబ్జెక్టులో పీజీ/ సంబంధిత మెథడాలజీలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ పూర్తిచేసినవారు; కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.

  • ఎడ్‌సెట్‌లో మేథమెటిక్స్‌ ఎంచుకోవాలంటే మేథ్స్‌ ప్రధాన సబ్జెక్టుగా బీఏ/బీఎస్సీ లేదా ఇంటర్‌ (మేథమెటిక్స్‌)తోపాటు బీసీఏ లేదా బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఫిజికల్‌ సైన్సెస్‌ ఎంచుకోవాలంటే ఇంటర్‌(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ)తోపాటు బీసీఏ లేదా బీఎస్సీ(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ)/ బీఎస్సీ (అలైడ్‌ మెటీరియల్‌ సైన్సెస్‌) పూర్తిచేసి ఉండాలి. బయలాజికల్‌ సైన్సెస్‌ ఎంచుకోవాలంటే ఇంటర్‌(బయలాజికల్‌ సైన్సెస్‌) తోపాటు బీసీఏ లేదా బీఎస్సీ (బోటనీ/ జువాలజీ)/ బీఎస్సీ(హోం సైన్స్‌)/ బీఎస్సీ(అలైడ్‌ లైఫ్‌ సైన్సెస్‌) పూర్తిచేసి ఉండాలి. సోషల్‌ స్టడీస్‌ ఎంచుకోవాలంటే ఇంటర్‌(సోషల్‌ సైన్సె్‌స)తోపాటు బీసీఏ లేదా బీఏ/ బీకాం/ బీబీఎం పూర్తిచేసి ఉండాలి. ఇంగ్లీష్‌ ఎంచుకోవాలంటే బీఏ(స్పెషల్‌ ఇంగ్లీష్‌)/ ఎంఏ (ఇంగ్లీష్‌) పూర్తిచేసి ఉండాలి. అలైడ్‌ మెటీరియల్‌ సైన్సెస్‌, అలైడ్‌ లైఫ్‌ సైన్సెస్‌ సబ్జెక్టుల వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

  • అభ్యర్థుల వయసు జూలై 1 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి నిబంధనలు లేవు.

ఇది కూడా చదవండి: KVS Notification: ఏకైక సంతానం కలిగిన వారికి..!

ఏపీ ఎడ్‌సెట్‌ 2023 వివరాలు

  • దీనిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మూడు పార్ట్‌లు ఉంటాయి. మొత్తం 150 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. మొదటి పార్ట్‌లో జనరల్‌ ఇంగ్లీష్‌ నుంచి 25; రెండో పార్ట్‌లో జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి 15, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 10 ప్రశ్నలు అడుగుతారు. మూడో పార్ట్‌లో అభ్యర్థి ఎంచుకొన్న సబ్జెక్టుకు సంబంధించిన మెథడాలజీ నుంచి 100 ప్రశ్నలు ఇస్తారు. మేథమెటిక్స్‌, ఇంగ్లీష్‌ సబ్జెక్టులకు వాటినుంచే 100 ప్రశ్నలు ఇస్తారు. ఫిజికల్‌ సైన్సెస్‌ సబ్జెక్ట్‌కు ఫిజిక్స్‌, కెమిస్ట్రీల నుంచి ఒక్కోదానిలో 50; బయలాజికల్‌ సైన్సెస్‌ సబ్జెక్టుకు బోటనీ, జువాలజీల నుంచి ఒక్కోదానిలో 50; సోషల్‌ స్టడీస్‌ సబ్జెక్టుకు జాగ్రఫీ నుంచి 35, హిస్టరీ నుంచి 30, సివిక్స్‌ నుంచి 15, ఎకనామిక్స్‌ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. అన్ని సబ్జెక్ట్‌లకూ మొదటి రెండు పార్ట్‌లూ కామన్‌గా ఉంటాయి. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 150. ప్రశ్నపత్రాన్ని (ఇంగ్లీష్‌ మెథడాలజీ మినహా) ఇంగ్లీష్‌, తెలుగు/ఉర్దూ మాధ్యమాల్లో ఇస్తారు. ఉర్దూ మాధ్యమంలో ఎగ్జామ్‌ రాయాలనుకొనేవారు కర్నూలు టెస్ట్‌ సెంటర్‌ను ఎంచుకోవాలి.

  • ఎడ్‌సెట్‌లో అర్హత పొందాలంటే కనీసం 37 మార్కులు (25 శాతం) రావాలి. ఫిజికల్‌ సైన్సెస్‌, మేథమెటిక్స్‌ మెథడాలజీ ఎంచుకొన్న మహిళలకు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నిబంధన వర్తించదు.

  • ఏపీ ఎడ్‌సెట్‌ 2023కు సంబంధించిన సిలబస్‌ కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.650; బీసీ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.450

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 23

కరక్షన్‌ ఆఫ్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌: మే 3 నుంచి 6 వరకు

హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడింగ్‌: మే 12 నుంచి

ఏపీ ఎడ్‌సెట్‌ 2023 తేదీ: మే 20

ప్రిలిమినరీ కీ విడుదల: మే 24న

వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in

ఇది కూడా చదవండి: BirthMarks: పుట్టు మచ్చల వెనుక కథేంటి..? పుట్టినప్పుడు లేని మచ్చలు ఆ తర్వాత ఎలా వస్తాయంటే..

Updated Date - 2023-03-29T13:05:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising