ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kaloji అనుబంధ కళాశాలల్లో బీఎస్సీ హెల్త్‌ సైన్సెస్‌

ABN, First Publish Date - 2023-01-04T12:21:13+05:30

వరంగల్‌ (Warangal)లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (Kaloji Narayana Rao University of Health Sciences) (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌)- బీఎస్సీ ఎంఎల్‌టీ

కళాశాలల్లో బీఎస్సీ హెల్త్‌ సైన్సెస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌ (Warangal)లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (Kaloji Narayana Rao University of Health Sciences) (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌)- బీఎస్సీ ఎంఎల్‌టీ (BSc MLT) సహా కొత్తగా ప్రకటించిన బీఎస్సీ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (BSc Allied Health Sciences) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా(Telangana) ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ అనుబంధ కళాశాలల్లో కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్లు (Quota seats) భర్తీ చేయనున్నారు. అకడమిక్‌ మెరిట్‌, కౌన్సెలింగ్‌ (Counselling), డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ (documents Verification) ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. కళాశాలలు, సీట్ల వివరాలను వెబ్‌ ఆప్షన్స్‌ నాటికి ప్రకటిస్తారు. స్థానికులకు 85 శాతం సీట్లు ప్రత్యేకించారు. తెలుగు రాష్ట్రాల(Telugu states) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. ఇందులోనే ఏడాది వ్యవధి గల కంపల్సరీ ఇంటర్న్‌షిప్‌ కూడా ఉంటుంది.

బీఎస్సీ ప్రోగ్రామ్‌లు: మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ (ఎంఎల్‌టీ), అనెస్తీషియా టెక్నాలజీ, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, కార్డియాక్‌ అండ్‌ కార్డియోవాస్కులర్‌ టెక్నాలజీ, రెనల్‌ డయాలసిస్‌ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, న్యూరోసైన్స్‌ టెక్నాలజీ, క్రిటికల్‌ కేర్‌ టెక్నాలజీ, రేడియాలజీ అండ్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ థెరపీ టెక్నాలజీ, మెడికల్‌ రికార్డ్స్‌ సైన్సెస్‌, న్యూక్లియర్‌ మెడిసిన్‌, రేడియో థెరపీ టెక్నాలజీ

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లీష్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్‌ /పన్నెండోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌తోపాటు బయాలజీ, ఫిజికల్‌ సైన్సె్‌సతో బ్రిడ్జ్‌ కోర్సు పూర్తిచేసినవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. 2022 డిసెంబరు 31 నాటికి అభ్యర్థుల వయసు 17 ఏళ్లు నిండి ఉండాలి.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.2,500; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2,000

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 10

దరఖాస్తుతోపాటు అప్‌లోడ్‌ చేయాల్సినవి: అభ్యర్థి ఫొటో, సంతకం; పదోతరగతి సర్టిఫికెట్‌, ఇంటర్‌/ తత్సమాన కోర్సు సర్టిఫికెట్‌, బ్రిడ్జ్‌ కోర్సు సర్టిఫికెట్‌, మార్కుల పత్రాలు; కులం, నివాసం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు; ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డ్‌; ఆరోతరగతి నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్‌లు, టీసీ.

వెబ్‌సైట్‌: https://alliedhs.tsche.in, www.knruhs.telangana.gov.in

Updated Date - 2023-01-04T12:21:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising