ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Degree admissions: తెలంగాణ వ్యవసాయ కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాలు

ABN, First Publish Date - 2023-06-16T17:33:06+05:30

అభ్యర్థులందరూ తెలంగాణ ఎంసెట్‌ 2023లో ర్యాంక్‌ సాధించి ఉండాలి. బీఎస్సీ ఆనర్స్‌, బీఎ్‌ఫఎస్సీ ప్రోగ్రామ్‌లలో చేరాలంటే అభ్యర్థుల వయసు

Degree admissions
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (పీజేటీఎస్‌ఏయూ), పీవీ నర సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్‌ఆర్‌టీవీయూ), సిద్దిపేట్‌-ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ (ఎస్‌కేఎల్‌టీఎ్‌సహెచ్‌యూ) ఉమ్మడిగా వ్యవసాయ ఆధారిత డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల చేశాయి. బైపీసీ స్ట్రీం కింద బీఎస్సీ ఆనర్స్‌, బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌, బీఎ్‌ఫఎస్సీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి రెగ్యులర్‌ అండ్‌ సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రికల్చరల్‌, వెటర్నరీ, హార్టికల్చర్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తెలంగాణ ఎంసెట్‌ 2023 ర్యాంక్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి అడ్మిషన్స్‌ ఇస్తారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌, శ్రీ కొండా లక్ష్మణ్‌ వర్సిటీల పరిధిలో ఒక్కోదానిలో 40 శాతం సీట్లు; పీవీ నరసింహారావు వర్సిటీ పరిధిలో 25 శాతం సీట్లను గ్రామీణ రైతు కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు ప్రత్యేకించారు. మొత్తమ్మీద 85 శాతం సీట్లను స్థానికులకు కేటాయించారు. ఆసక్తిగల తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ సీట్ల భర్తీకి విడిగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

బీఎస్సీ ఆనర్స్‌

  • ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. అగ్రికల్చర్‌, కమ్యూనిటీ సైన్స్‌, హార్టికల్చర్‌ విభాగాలు ఉన్నాయి.

  • పీజేటీఎ్‌సఏయూ పరిధిలోని రాజేంద్రనగర్‌, అశ్వారావుపేట, పొలాస, పాలెం, వరంగల్‌ అర్బన్‌, సిరిసిల్లా, ఆదిలాబాద్‌ అగ్రికల్చరల్‌ కాలేజీల్లో మొత్తం 520 రెగ్యులర్‌ సీట్లు, 200 సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ సీట్లు ఉన్నాయి. సైఫాబాద్‌ కమ్యూనిటీ సైన్స్‌ కాలేజీలో 38 రెగ్యులర్‌ సీట్లు, 5 సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లు ఉన్నాయి.

  • ఎస్‌కేఎల్‌టీఎ్‌సహెచ్‌యూ పరిధిలోని రాజేంద్రనగర్‌, మోజెర్ల హార్టికల్చర్‌ కాలేజీల్లో మొత్తం 170 రెగ్యులర్‌ సీట్లు, 34 సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ సీట్లు ఉన్నాయి.

  • బీఎస్సీ ఆనర్స్‌(అగ్రికల్చర్‌/కమ్యూనిటీ సైన్స్‌) ప్రోగ్రామ్‌లలో 15 శాతం సీట్లను ఐకార్‌ కోటా కింద ప్రత్యేకించారు. వీటిని ‘యూజీ-ఏఐఈఈఏ 2023’ ద్వారా ఐకార్‌ భర్తీ చేస్తుంది.

బీవీఎస్సీ & ఏహెచ్‌

  • ప్రోగ్రామ్‌ వ్యవధి అయిదున్నరేళ్లు. ఈ ప్రోగ్రామ్‌లో వెటర్నరీ సైన్స్‌ ప్రధాన విభాగం.

  • పీవీఎన్‌ఆర్‌టీవీయూ పరిధిలోని రాజేంద్రనగర్‌, కోరుట్ల, మామునూర్‌ వెటర్నరీ సైన్స్‌ కాలేజీల్లో మొత్తం 174 సీట్లు ఉన్నాయి.

బీఎఫ్‌ఎస్సీ

  • ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. ఈ ప్రోగ్రామ్‌లో ఫిషరీ సైన్స్‌ ప్రధాన విభాగం.

  • పీవీఎన్‌ఆర్‌టీవీయూ పరిధిలోని పెబ్బైర్‌ ఫిషరీ సైన్స్‌ కాలేజీలో 28 సీట్లు, నెల్లూరు జిల్లా-ముత్తుకూరు ఫిషరీ సైన్స్‌ కాలేజీలో 11 సీట్లు ఉన్నాయి. ముత్తుకూరు ఫిషరీ సైన్స్‌ కాలేజీలో 36 శాతం సీట్లను తెలంగాణ అభ్యర్థులకు నిర్దేశించారు.

అర్హత వివరాలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లీష్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్‌/పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఇంటర్‌ స్థాయిలో ద్వితీయ శ్రేణి మార్కులు తప్పనిసరి. అభ్యర్థులందరూ తెలంగాణ ఎంసెట్‌ 2023లో ర్యాంక్‌ సాధించి ఉండాలి. బీఎస్సీ ఆనర్స్‌, బీఎ్‌ఫఎస్సీ ప్రోగ్రామ్‌లలో చేరాలంటే అభ్యర్థుల వయసు డిసెంబరు 31 నాటికి జనరల్‌ అభ్యర్థులకు 17 నుంచి 22 ఏళ్ల మధ్య; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 17 నుంచి 25 ఏళ్ల మధ్య; దివ్యాంగులకు 17 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌ ప్రోగ్రామ్‌లో చేరాలంటే జనరల్‌ అభ్యర్థులకు 17 నుంచి 25 ఏళ్ల మధ్య; దివ్యాంగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 17 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1800; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.900

దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: జూలై 15

ఆన్‌లైన్‌ దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: జూలై 17

కరెక్షన్‌ విండో ఓపెన్‌: జూలై 18, 19

వెబ్‌సైట్‌: www.pjtsau.edu.in

Updated Date - 2023-06-16T17:33:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising