ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NIMS: హైదరాబాద్‌ నిమ్స్‌లో ఎమ్మెస్సీ ప్రవేశాలు

ABN, First Publish Date - 2023-06-30T13:00:23+05:30

హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(నిమ్స్‌)-ఎమ్మెస్సీ(జెనెటిక్‌ కౌన్సెలింగ్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(నిమ్స్‌)-ఎమ్మెస్సీ(జెనెటిక్‌ కౌన్సెలింగ్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ(లైఫ్‌ సైన్సె్‌స/నర్సింగ్‌/హ్యూమన్‌ జెనెటిక్స్‌/హ్యూమన్‌ బయాలజీ/మెడికల్‌ బయోటెక్నాలజీ/మాలిక్యులర్‌ బయాలజీ)/బీటెక్‌(బయోటెక్నాలజీ/జెనెటిక్‌ ఇంజనీరింగ్‌/బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌/బయలాజికల్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణులై ఉండాలి. ఎంబీబీఎస్‌ పూర్తిచేసి ఎంసీఐ గుర్తింపు ఉన్నవారు, బీడీఎస్‌ ఉత్తీర్ణులై డీసీఐ గుర్తింపు పొందినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు డిసెంబరు 31 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌: ఈ పరీక్షలో మొత్తం 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. లైఫ్‌ సైన్సెస్‌, బేసిక్‌ జెనెటిక్స్‌, సెల్‌ బయాలజీ అండ్‌ డివిజన్‌, సైటోజెనెటిక్స్‌, మాలిక్యులర్‌ జెనెటిక్స్‌, రీసెర్చ్‌ మెథడాలజీ, పాపులేషన్‌ జెనెటిక్స్‌, సైకో సోషల్‌ అండ్‌ ఎథికల్‌ ఇస్యూస్‌ ఇన్‌ మెడిసిన్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థు లు సమాధానాలను ఓఎంఆర్‌ పత్రం మీద గుర్తించాలి. మొత్తం మార్కులు 100. పరీక్ష సమయం రెండు గంటలు. ఈ పరీక్షలో అర్హత పొందాలంటే కనీసం 50 శాతం మార్కులు రావాలి.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.5,000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.4,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 18

దరఖాస్తు హార్డ్‌ కాపీ చేరేందుకు చివరి తేదీ: జూలై 21

ఈ మెయిల్‌ ద్వారా హాల్‌ టికెట్‌లు పంపు తేదీ: ఆగస్టు 8

ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ తేదీ: ఆగస్టు 11

తరగతులు ప్రారంభం: సెప్టెంబరు 1 నుంచి

చిరునామా: అసోసియేట్‌ డీన్‌, అకడమిక్‌-2, రెండో అంతస్తు, పాత ఓపీడీ బ్లాక్‌, నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, హైదరాబాద్‌-500082

వెబ్‌సైట్‌: www.nims.edu.in

Updated Date - 2023-06-30T13:00:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising