సికింద్రాబాద్ ఎన్‌ఐఈపీఐడీలో ప్రవేశానికి నోటిఫికేషన్
ABN, First Publish Date - 2023-06-07T15:21:46+05:30
సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్ (ఎన్‌ఐఈపీఐడీ)- డిప్లొమా, డీఈడీ, బీఈడీ, ఎంఈడీ, ఎంఫిల్, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి
సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్ (ఎన్‌ఐఈపీఐడీ)- డిప్లొమా, డీఈడీ, బీఈడీ, ఎంఈడీ, ఎంఫిల్, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సికింద్రాబాద్ సహా కోల్‌కతా, నవీ ముంబై, నోయిడా, సీఆర్‌సీ సెంటర్లలో ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. పీజీ డిప్లొమా వ్యవధి ఏడాది. మిగిలిన ప్రోగ్రామ్‌ల వ్యవధి రెండేళ్లు. ఎంట్రెన్స్ టెస్ట్, కౌన్సెలింగ్, ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. డిప్లొమా, డీఈడీ ప్రోగ్రామ్‌లలో మాత్రం అకడమిక్ మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రోగ్రామ్‌లన్నింటికీ ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆయా సెంటర్లకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
సికింద్రాబాద్ సెంటర్‌లోని ప్రోగ్రామ్‌లు-సీట్లు
ఎంఫిల్ రీహాబిలిటేషన్ సైకాలజీ - 15 సీట్లు
ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(ఐడీ) - 27 సీట్లు
బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(ఐడీ) - 33 సీట్లు
పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ - 22 సీట్లు
డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(స్పెషల్ ఎడ్యుకేషన్) - 38 సీట్లు
డిప్లొమా- ఎర్లీ ఛైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ 33 సీట్లు, ఒకేషనల్ రీహాబిలిటేషన్ 33 సీట్లు
కోల్‌కతా, నవీ ముంబై సెంటర్లలోని ప్రోగ్రామ్‌లు-సీట్లు
ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(ఐడీ)-నవీ ముంబైలో 15 సీట్లు; కోల్‌కతాలో 12 సీట్లు
బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(ఐడీ)-నవీ ముంబైలో 20 సీట్లు; కోల్‌కతాలో 33 సీట్లు
డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్- నవీ ముంబైలో 35 సీట్లు; కోల్‌కతాలో 33 సీట్లు
డిప్లొమా(ఒకేషనల్ రీహాబిలిటేషన్)-నవీ ముంబైలో 25 సీట్లు; కోల్‌కతాలో 33 సీట్లు
నోయిడా సెంటర్
డీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్) ప్రోగ్రామ్‌లో 35 సీట్లు ఉన్నాయి.
సీఆర్‌సీ సెంటర్లు
దావణ్‌గిరి సీఆర్‌సీలో డీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్)లో ఐడీడీ 35 సీట్లు; హెచ్‌ఐ 35 సీట్లు ఉన్నాయి.
నెల్లూరు సీఆర్‌సీలో డీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్)లో హెచ్‌ఐ 35 సీట్లు ఉన్నాయి.
రాజ్‌నంద్‌గావ్ సీఆర్‌సీలో డీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్)లో ఐడీడీ ప్రోగ్రామ్ ఉంది.
అర్హత వివరాలు: బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌నకు ద్వితీయ శ్రేణి మార్కులతో బీఏ/బీకాం/బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్‌కు ఎంబీబీఎస్/ బీఏఎంఎస్/ బీయూఎంఎస్/ బీహెచ్‌ఎంఎస్/ బీఎన్‌వై/బీఓటీ/ బీపీటీ/ బీఏఎ్‌సఎల్‌పీ/ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ / బీఎస్సీ నర్సింగ్/ ఉత్తీర్ణులు; పీజీ(సైకాలజీ/ సోషల్ వర్క్/ స్పెషల్ ఎడ్యుకేషన్/ చైల్డ్ డెవల్‌పమెంట్) చేసినవారు అప్లయ్ చేసుకోవచ్చు. ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ప్రవేశానికి బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్/ జనరల్ ఎడ్యుకేషన్) లేదా ఇంటిగ్రేటెడ్ బీఏ/బీకాం/బీఎస్సీ - బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. ఎంఫిల్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సైకాలజీలో కనీసం 55 శాతం మార్కులతో ఎంఏ/ ఎమ్మెస్సీ పూర్తిచేసి ఉండాలి. డిప్లొమా, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లకు ద్వితీయ శ్రేణి మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంట్రెన్స్ టెస్ట్ వివరాలు
ఎంఫిల్ రీహాబిలిటేషన్ సైకాలజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నిర్వహించే ఎగ్జామ్‌లో సైకాలజీ, డిజెబిలిటీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ఎంఈడీ/ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే ఎగ్జామ్‌లలో జనరల్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఎడ్యుకేషన్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంశాలనుంచి ప్రశ్నలు అడుగుతారు.
పీజీ డిప్లొమా ఎంట్రెన్స్ టెస్ట్‌లో చైల్డ్ డెవల్‌పమెంట్, డిజెబిలిటీ రీహాబిలిటేషన్ అంశాలనుంచి ప్రశ్నలు ఇస్తారు.
మొత్తం మార్కులు 100. పరీక్ష సమయం గంటన్నర.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, బీసీ అభ్యర్థులకు రూ.1500; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1100
దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: సికింద్రాబాద్ సెంటర్‌కు జూలై 3, కోల్‌కతా సెంటర్‌కు జూలై 17, నవీ ముంబై సెంటర్‌కు జూలై 21
డిప్లొమా, డీఈడీ ప్రోగ్రామ్‌ల దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 5
ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ: సికింద్రాబాద్ సెంటర్‌కు జూలై 27, నవీ ముంబై సెంటర్‌కు ఆగస్టు 5; కోల్‌కతా సెంటర్ తేదీని త్వరలో ప్రకటిస్తారు.
వెబ్‌సైట్: www.niepid.nic.in
Updated Date - 2023-06-07T15:21:46+05:30 IST