Andhra NIT: నిట్ ఆంధ్రలో రీసెర్చ్ ప్రోగ్రామ్‌లు
ABN, First Publish Date - 2023-11-13T12:59:25+05:30
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్ ఆంధ్ర)-ఎంఎ్‌స(రీసెర్చ్), పీహెచ్‌డీ 2023 డిసెంబరు సెషన్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్ ఆంధ్ర)-ఎంఎ్‌స(రీసెర్చ్), పీహెచ్‌డీ 2023 డిసెంబరు సెషన్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. పీహెచ్‌డీలో ఫుల్ టైం, పార్ట్ టైం, అండర్ ప్రాజెక్ట్ కేటగిరీలు ఉన్నాయి. రిటెన్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. పీహెచ్‌డీ ఫుల్ టైం అభ్యర్థులకు హాఫ్ టైం రీసెర్చ్ అసిస్టెంట్‌షి్‌ప(హెచ్‌టీఆర్‌ఏ) లభిస్తుంది.
పీహెచ్‌డీ విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్, సైన్సెస్, మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, మేనేజ్‌మెంట్
ఎంఎ్‌స(రీసెర్చ్) విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్
అర్హత వివరాలు
పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సంబంధిత స్పెషలైజేషన్‌తో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి. నెట్/గేట్ వ్యాలిడ్ స్కోర్ ఉండాలి. డీఎ్‌సటీ/సీఎ్‌సఐఆర్/యూజీసీ/ఎన్‌బీహెచ్‌ఎం నుంచి ఫెలోషిప్ అర్హత ఉన్నవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. పార్ట్ టైం అభ్యర్థులకు రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లు/అకడమిక్ ఇన్‌స్టిట్యూషన్‌లు/ఇండస్ట్రీలలో కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
ఎంఎస్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లు/అకడమిక్ ఇన్‌స్టిట్యూషన్‌లు/ఇండస్ట్రీలలో కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1,000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 1
వెబ్‌సైట్: www.nitandhra.ac.in
Updated Date - 2023-11-13T13:00:21+05:30 IST