ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC paper leak: కేంద్ర సంస్థ ఎంటరైంది! అన్నీ నిర్ధారించుకున్నాకే ఎంట్రీ!

ABN, First Publish Date - 2023-04-03T10:52:57+05:30

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంపై ఆదివారం సాయంత్రం

TSPSC paper leak
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పేపర్‌ లీకేజీపై ఈడీ కేసు నమోదు!

విదేశీ నిధులపై ఇటీవలే రేవంత్‌ ఫిర్యాదు..

అన్నీ నిర్ధారించుకున్నాకే రంగంలోకి ఈడీ!!

సిట్‌తోపాటు సమాంతర దర్యాప్తు..

కోర్టు అనుమతితో నిందితులను విచారించే అవకాశం

హైదరాబాద్‌/హిమాయత్‌నగర్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంపై ఆదివారం సాయంత్రం కేసు(ఈసీఐఆర్‌) నమోదు చేసినట్లు మీడియాకు లీకులందాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇచ్చిన ఫిర్యాదులతోపాటు.. పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్న ఆధారాల మేరకు ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో హవాలా మార్గంలో డబ్బులు చేతులు మారినట్లు ఈడీ అనుమానిస్తోంది. పేపర్‌ లీకేజీకి సంబంధించి టీఎ్‌సపీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్‌ ఫిర్యాదు మేరకు తొలుత బేగంబజార్‌ పోలీసులు కేసు నమోదు చేయగా.. కేసు తీవ్రత దృష్ట్యా హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిట్‌ ఇప్పటి వరకు ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి సహా.. మొత్తం 15 మందిని అరెస్టు చేసింది. కోర్టు అనుమతితో పలువురు నిందితులను కస్టడీలోకి తీసుకుని, విచారించింది.

ఇప్పుడు ఈడీ కూడా ఈ కేసులో మనీలాండరింగ్‌ కోణంలో సమాంతర దర్యాప్తు చేయనుంది. అరెస్టయిన 15 మందిని కోర్టు అనుమతితో విచారించనున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సెక్రటరీ, సభ్యులను, ఇతర ఉద్యోగులను కూడా విచారించే అవకాశాలున్నాయి. మనీలాండరింగ్‌ కోణంలో నిందితుల యూపీఐ లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, నగదు బదిలీ వంటి అంశాలపై ఆయా బ్యాంకులకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ముఖ్యంగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో.. పేపర్‌ లీకేజీతో వచ్చిన కోట్ల రూపాయలను ప్రవీణ్‌, రాజశేఖర్‌ హవాలా మార్గాల్లో విదేశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని బట్టి, ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందంటూ ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. ఆధారాలను బయటపెడుతున్న విపక్షాలపై సిట్‌ కేసులు నమోదు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రశ్నపత్రాల లీకేజీతో కోట్ల రూపాయలను కొల్లగొట్టిన నిందితులను అరెస్టు చేయాలని ఆ ఫిర్యాదులో కోరారు. విదేశాల నుంచి వచ్చిన ఎన్నారైలు గ్రూప్‌-1 పరీక్ష రాశారని, దీనిపైనా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. కాన్ఫిడెన్షియల్‌ విభాగం ఇన్‌చార్జి శంకర్‌లక్ష్మికి, చైర్మన్‌, సెక్రటరీలకు తెలియకుండా టీఎస్‌పీఎస్సీలో సాధారణ ఉద్యోగులు లీకేజీకి పాల్పడే అవకాశాలు లేవని, వారిని కూడా విచారించాలని రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఈడీని కోరారు.

Updated Date - 2023-04-03T10:52:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising