Tenth exams: రూపాయి ఖర్చు లేకుండా ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లొచ్చు! ఎలాగంటే..!
ABN, First Publish Date - 2023-03-30T12:03:27+05:30
పదో తరగతి పరీక్షల (Tenth exams)కు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురి కాకుండా సంసిద్ధం కావాలని విద్యా శాఖ
హైదరాబాద్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల (Tenth exams)కు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురి కాకుండా సంసిద్ధం కావాలని విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy) సూచించారు. ఏప్రిల్ 3 నుంచి జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసి, వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఉందని అన్నారు. లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతున్న పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు హాల్ టికెట్ (Hall Ticket) చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం (Free travel in RTC buses) చేసే సౌకర్యం కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో మార్చి 15న ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు 29వ తేదీతో ముగిశాయి.
Updated Date - 2023-03-30T12:03:27+05:30 IST