Telangana: బుధవారం నుంచి ఒంటిపూట బడులు.. టెన్త్ పరీక్ష కేంద్రాల్లో మాత్రం..!
ABN, First Publish Date - 2023-03-14T11:54:56+05:30
ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులను (Half Day Classes) ప్రారంభించనున్నారు. పాఠశాలలు విధిగా ఒంటిపూట తరగతులను నిర్వహించాలని
హైదరాబాద్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులను (Half Day Classes) ప్రారంభించనున్నారు. పాఠశాలలు విధిగా ఒంటిపూట తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24 వరకు తరగతులు కొనసాగించాలని ఉత్తర్వుల్లో (Telangana government) పేర్కొంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల యాజమాన్యాలు ఈ ఉత్తర్వులను అమలు చేయాలని పేర్కొంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి పనిచేస్తాయి. మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు కొనసాగించాలి. భోజనాన్ని మధ్యాహ్నం 12.30 గంటలకు అందించాలి. ఎస్‌ఎస్‌సీ పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలి.
Updated Date - 2023-03-14T11:54:56+05:30 IST