ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad Private schools: సమ్మర్ హాలీడేస్‌లో కూడా వేధింపులే!

ABN, First Publish Date - 2023-03-27T12:59:32+05:30

వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని విద్యాసంస్థల యజమానులు మరోసారి దోపిడీకి సిద్ధమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్‌, మే నెలలకు కూడా ఫీజు

మే ఫీజూ కట్టాలట..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రైవేట్‌ స్కూళ్ల నయా దందా

లేకుంటే హాల్‌టికెట్లు ఇవ్వబోమని బెదిరింపులు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): నగరం (Hyderabad)లోని కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు (Private schools) కొత్త తరహా దోపిడీకి తెరలేపాయి. పుస్తకాల (Books) కొనుగోలు నుంచి ఫీజుల (fee) చెల్లింపు వరకు అడ్డగోలుగా దోచుకుంటూనే కొత్త కొత్త నిబంధనలు అమలు చేస్తున్నాయి. వేసవి సెలవుల (summer vacation) కాలంలోనూ ఫీజులు చెల్లించాలని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడికి గురి చేస్తున్నాయి. నగరంలో 1,886 ప్రైవేట్‌ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో 860 కార్పొరేట్‌ పాఠశాలలు. మిగతావి బడ్జెట్‌ బడులు. అందులో 6.70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. పలు కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ విద్యాసంస్థలు నిబంధనలను తుంగలో తొక్కి తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్నాయి.

అదనంగా రెండు నెలలు..

వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని విద్యాసంస్థల యజమానులు మరోసారి దోపిడీకి సిద్ధమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్‌, మే నెలలకు కూడా ఫీజు చెల్లించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. వాస్తవంగా ఏటా జూన్‌ 12న ప్రారంభమయ్యే విద్యాసంవత్సరం ఏప్రిల్‌ 23తో ముగుస్తోంది. జూన్‌ నుంచి మార్చి వరకు (పది నెలలు) మాత్రమే విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయాలని నిబంధన ఉంది. కొన్ని స్కూళ్లు ఏప్రిల్‌ నెలకు కూడా ఫీజు తీసుకునేవి. అయితే, ఈ విద్యాసంవత్సరంలో మే నెలకు సంబంధించిన ఫీజును కూడా చెల్లించాలని, అది కూడా ఏప్రిల్‌ నెలతో కలిపి చెల్లిస్తేనే వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు జారీ చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్‌ సందేశాలు పంపుతున్నారు.

పర్యవేక్షణ కరువు

జిల్లాలోని 16 మండలాలకు 24 మంది డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ (డీఐఓఎస్‌) ఉన్నారు. ప్రస్తుతం ఒక్కరే రెగ్యులర్‌గా ఉండగా, మిగతా 23 మంది హెచ్‌ఎంలుగా పాఠశాలల్లో పనిచేస్తూ డీఐఓఎ్‌సలుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారు పాఠశాలల పనితీరును నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలి. కానీ, పనిభారంతో ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేయకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయు. వేసవి సెలవుల కాలానికి కూడా ఫీజులను వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి జావిద్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-03-27T12:59:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising