ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ ఉర్దూ వర్సిటీలో ప్రవేశానికి నోటిఫికేషన్.. ఇతర క్యాంపస్‌ల్లో ఇలా..!

ABN, First Publish Date - 2023-05-05T12:58:21+05:30

హైదరాబాద్‌ (Hyderabad)లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) - పలు అకడమిక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Hyderabad Urdu University
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (Hyderabad)లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) - పలు అకడమిక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ, పీజీ, బీఈడీ, పీహెచ్‌డీ, ప్రొఫెషనల్‌ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రోగ్రామ్‌ను అనుసరించి ఎంట్రెన్స్‌ టెస్ట్‌/ అకడమిక్‌ మెరిట్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. డిగ్రీ ప్రోగ్రామ్‌లలో మాత్రం ఎన్‌టీఏ నిర్వహించే కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(సీయూఈటీ) 2023 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర క్యాంప్‌సలలో కూడా అడ్మిషన్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇచ్చే ప్రోగ్రామ్‌లు

పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు: అరబిక్‌, ఉర్దూ, ఇంగ్లీష్‌, హిందీ, పర్షియన్‌, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌, ఉమెన్‌ స్టడీస్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌, సోషల్‌ వర్క్‌, ఇస్లామిక్‌ స్టడీస్‌, హిస్టరీ, ఎకనామిక్స్‌, సోషియాలజీ, దక్కన్‌ స్టడీస్‌, ఎడ్యుకేషన్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, మేనేజ్‌మెంట్‌, కామర్స్‌, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ ఉర్దూ కల్చర్‌ స్టడీస్‌, కంపారటివ్‌ స్టడీస్‌

పీజీ ప్రోగ్రామ్‌లు: ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌), ఎంఈడీ, బీఈడీ

డిగ్రీ ప్రోగ్రామ్‌లు: బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌), బీటెక్‌-కంప్యూటర్‌ సైన్స్‌(లేటరల్‌ ఎంట్రీ)

ప్రొఫెషనల్‌ డిప్లొమాలు: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈఎల్‌ఈడీ), పాలిటెక్నిక్‌ డిప్లొమా(సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌, ఆటొమొబైల్‌ అండ్‌ అప్పారెల్‌ టెక్నాలజీస్‌), పాలిటెక్నిక్‌ డిప్లొమా లేటరల్‌ ఎంట్రీ

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 28

అకడమిక్‌ మెరిట్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇచ్చే ప్రోగ్రామ్‌లు

పీజీ ప్రోగ్రామ్‌లు: ఎంఏ(ఉర్దూ, ఇంగ్లీష్‌, హిందీ, అరబిక్‌, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌, పర్షియన్‌, ఉమెన్‌ స్టడీస్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌, ఇస్లామిక్‌ స్టడీస్‌, హిస్టరీ, ఎకనామిక్స్‌, సోషియాలజీ, లీగల్‌ స్టడీస్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌), ఎంఎ్‌సడబ్ల్యు(సోషల్‌ వర్క్‌) ఎంకాం, ఎమ్మెస్సీ(మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ), ఎం ఒకేషనల్‌(ఎంఎల్‌టీ, ఎంఐటీ)

ఫుల్‌ టైం పీజీ డిప్లొమా: టీచింగ్‌ ఇంగ్లీష్‌

పార్ట్‌ టైం పీజీ డిప్లొమాలు: ఫంక్షనల్‌ ఉర్దూ, హిందీ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌, ప్రొఫెషనల్‌ అరబిక్‌, ట్రాన్స్‌లేషన్‌

పార్ట్‌ టైం డిప్లొమాలు: తహ్సీన్‌-ఎ-గజల్‌, అరబిక్‌, పర్షియన్‌, పాష్టో, ఫ్రెంచ్‌, రష్యన్‌, ఇస్లామిక్‌ స్టడీస్‌

పార్ట్‌ టైం సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లు: ఉర్దూ, ప్రొఫిషియెన్సీ ఇన్‌ అరబిక్‌, పర్షియన్‌, పాష్టో, ఫ్రెంచ్‌, రష్యన్‌, తెలుగు, కశ్మీరీ, టర్కిష్‌

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 24

ఇతర క్యాంపస్‌లు అందిస్తున్న ప్రోగ్రామ్‌లు

  • లఖ్‌నవూ క్యాంపస్‌: ఎంఏ(ఉర్దూ, ఇంగ్లీష్‌, అరబిక్‌, పర్షియన్‌), పీహెచ్‌డీ (ఇంగ్లీష్‌, ఉర్దూ, అరబిక్‌, పర్షియన్‌)

  • శ్రీనగర్‌ క్యాంపస్‌: (ఎంఏ/ పీహెచ్‌డీ) (ఎకనామిక్స్‌, ఇస్లామిక్‌ స్టడీస్‌, ఉర్దూ, పర్షియన్‌, ఇంగ్లీష్‌), పీహెచ్‌డీ(ఉర్దూ, ఇంగ్లీష్‌, ఇస్లామిక్‌ స్టడీస్‌, ఎకనామిక్స్‌)

  • కాలేజెస్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌-భోపాల్‌(మధ్యప్రదేశ్‌), దర్బంగా(బిహార్‌): ఎడ్యుకేషన్‌ విభాగంలో బీఈడీ, ఎంఈడీ, పీహెచ్‌డీ ఇన్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌లు

  • కాలేజెస్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌-శ్రీనగర్‌(జమ్మూ అండ్‌ కశ్మీర్‌), అసన్సోల్‌(పశ్చిమ బెంగాల్‌), ఔరంగాబాద్‌(మహారాష్ట్ర), సంభాల్‌(ఉత్తరప్రదేశ్‌), నుహ్‌(హరియాణా), బీదర్‌(కర్ణాటక): బీఈడీ ప్రోగ్రామ్‌

  • పాలిటెక్నిక్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమాలు: డిప్లొమా ఇన్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌(దర్భంగా, బెంగళూరు క్యాంప్‌్‌సలు); డిప్లొమా ఇన్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌, డిప్లొమా ఇన్‌ అప్పారెల్‌ టెక్నాలజీ్‌స(కడప-ఏపీ క్యాంపస్‌); డిప్లొమా ఇన్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌, డిప్లొమా ఇన్‌ ఆటొమొబైల్‌ ఇంజనీరింగ్‌(కటక్‌ - ఒడిషా క్యాంపస్‌).

అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి/ఇంటర్‌/డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉర్దూ మీడియంలోగానీ ఉర్దూ ఒక సబ్జెక్టుగా గానీ చదివి ఉండాలి. వర్సిటీ గుర్తింపు పొందిన మదర్సాలలో చదువుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్‌సైట్‌: manuu.edu.in

Updated Date - 2023-05-05T12:58:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising