ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Ambedkar గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు

ABN, First Publish Date - 2023-03-06T17:57:46+05:30

తాడేపల్లి (Tadepalli)లోని ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)- ఇంటర్‌ (Inter) లో

ఇంటర్‌ ప్రవేశాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తాడేపల్లి (Tadepalli)లోని ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)- ఇంటర్‌ (Inter) లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డా.బీ.ఆర్‌.అంబేద్కర్‌ గురుకులాలు, ఐఐటీ/మెడికల్‌ అకాడమీల్లో అడ్మిషన్స్‌ నిర్వహిస్తారు. బీఆర్‌ఏజీ ఇంటర్‌ సెట్‌ 2023 ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విద్యార్థులు సొంత జిల్లా గురుకులంలో ప్రవేశానికి మాత్రమే అప్లయ్‌ చేసుకోవాలి. అభ్యర్థి కోరుకున్న గ్రూప్‌ అక్కడ లేని పక్షంలో సంబంధిత జోన్‌ పరిధిలోని మరో జిల్లా గురుకులానికి అప్లయ్‌ చేసుకోవచ్చు. దరఖాస్తును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన తరవాత మార్పులకు అవకాశం లేదు.

బీఆర్‌ఏజీ ఇంటర్‌ సెట్‌ వివరాలు

  • దీనిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్దేశించిన పదోతరగతి సిలబస్‌ ఆధారంగానే ఉంటాయి. మేథమెటిక్స్‌ నుంచి 25; ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌, ఇంగ్లీ్‌ష(కాంప్రహెన్షన్‌ అండ్‌ గ్రామర్‌), లాజికల్‌ రీజనింగ్‌ సబ్జెక్టుల నుంచి ఒక్కోదానిలో 15 ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థులు సమాధానాలను బ్లూ/ బ్లాక్‌ పెన్‌తో ఓఎంఆర్‌ పత్రం మీద గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. సమాధానం తప్పుగా గుర్తిస్తే పావు మార్కు కోత విధిస్తారు. మొత్తం మార్కులు 100. పరీక్ష సమయం రెండున్నర గంటలు.

  • బీఆర్‌ఏజీ ఇంటర్‌ సెట్‌ 2023లో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఐఐటీ- మెడికల్‌ అకాడమీల్లో ప్రవేశానికి షార్ట్‌లిస్ట్‌ రూపొందిస్తారు. వీరికి మాత్రమే మరో ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ పరీక్ష డిస్ర్కిప్టివ్‌ విధానంలో ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు. మేథమెటిక్స్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, బయలాజికల్‌ సైన్సెస్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇవి కూడా పదోతరగతి స్థాయిలోనే ఉంటాయి.

  • ప్రశ్నపత్రాలు తెలుగు, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో ఉంటాయి.

అర్హత: ప్రస్తుతం పదోతరగతి పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు ఆగస్టు 31 నాటికి 17 ఏళ్లు మించకూడదు. ఇప్పటికే ఈ గురుకులాలల్లో చదువుతున్నవారికి ఒక ఏడాది సడలింపు వర్తిస్తుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.1,00,000 లోపు ఉండాలి.

సీట్లు

  • రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఎంపీసీ 5280, బైపీసీ 5280, ఎంఈసీ 800, సీఈసీ 1600, హెచ్‌ఈసీ 360 సీట్లు ఉన్నాయి.

  • ఐఐటీ-మెడికల్‌ అకాడమీల్లో మొత్తం 650 సీట్లు ఉన్నాయి. వీటిలో ఎంపీసీకి 370, బైపీసీకి 280 సీట్లు కేటాయించారు.

ముఖ్య సమాచారం

ఐఐటీ/ మెడికల్‌ అకాడమీల్లో చేరాలనుకొనే అభ్యర్థులు ముందుగానే దరఖాస్తులో తెలపాలి.

దరఖాస్తు ఫీజు లేదు

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 24

అడ్మిట్‌ కార్డ్‌ల డౌన్‌లోడింగ్‌: ఏప్రిల్‌ 16 నుంచి

బీఆర్‌ఏజీ ఇంటర్‌ సెట్‌ 2023 తేదీ: ఏప్రిల్‌ 23

ఐఐటీ-మెడికల్‌ అకాడమీల్లో ప్రవేశానికి టెస్ట్‌ తేదీ: మే 21

వెబ్‌సైట్‌: apgpcet.apcfss.in

ఇది కూడా చదవండి: షాకింగ్ ఘటన.. పక్కింటి వాళ్లు పెళ్లికి పిలవలేదని ఓ వ్యక్తి వింత నిర్వాకం..!

Updated Date - 2023-03-06T17:58:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising