ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Tenth Exam: పాసైన పేపర్లకూ మళ్లీ పరీక్ష..! జగన్ సర్కార్ విచిత్ర విధానం

ABN, First Publish Date - 2023-09-30T11:02:57+05:30

ఫెయిలైన సబ్జెక్టులకే సప్లిమెంటరీ పరీక్షలు రాయడం మనకు తెలుసు. కానీ.. పాసైన సబ్జెక్టులకూ తిరిగి పరీక్షలు రాయడం ఎక్కడైనా చూశారా..? బహుశా ఇలాంటి విధానం దేశంలో ఎక్కడా ఉండదు..! కానీ, జగన్‌ ప్రభుత్వం మాత్రం ఈ వింత విధానాన్ని

  • ఒకటి తప్పినా.. అన్ని పేపర్లూ రాయాలి

  • వాటిలో ఎక్కువ మార్కులు పరిగణలోకి

  • టెన్త్‌ పరీక్షలో సర్కారు విచిత్ర విధానం

  • రీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులపై ఒత్తిడి

అమరావతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఫెయిలైన సబ్జెక్టులకే సప్లిమెంటరీ పరీక్షలు రాయడం మనకు తెలుసు. కానీ.. పాసైన సబ్జెక్టులకూ తిరిగి పరీక్షలు రాయడం ఎక్కడైనా చూశారా..? బహుశా ఇలాంటి విధానం దేశంలో ఎక్కడా ఉండదు..! కానీ, జగన్‌ ప్రభుత్వం మాత్రం ఈ వింత విధానాన్ని ప్రవేశపెట్టింది. గతేడాది పొరపాటున కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయితే తిరిగి ఆరు సబ్జెక్టులకూ పరీక్షలు రాయాలనే నిబంధన తీసుకొచ్చింది. రీ అడ్మిషన్ల పేరుతో ఈ అడ్డగోలు విధానాన్ని అమలు చేయబోతోంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాఠశాల విద్యాశాఖ రీఅడ్మిషన్లు అంటూ నూతన విధానం తీసుకొచ్చింది. అంటే టెన్త్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులను తిరిగి బడుల్లో చేర్చుకుంది. సాధారణంగా ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఇంటి వద్దే చదువుకుని సప్లిమెంటరీ రాసి ఉత్తీర్ణులవుతారు. కానీ.. వారిని తిరిగి బడుల్లో చేర్చుకుని విద్యార్థుల సంఖ్య మెరుగ్గా ఉన్నట్టు ప్రభుత్వం చూపించింది. ఎలాగూ పాఠాలు చెబుతున్నారు కదా అని సుమారు 30 వేల మంది టెన్త్‌ ఫెయిలైన విద్యార్థులను తల్లిదండ్రులు తిరిగి బడుల్లో చేర్పించారు. వారికి రెగ్యులర్‌ విద్యార్థుల తరహాలో హాజరు, బోధన, మధ్యాహ్న భోజనం, అమ్మఒడి పథకాలను (Amma odi) ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడు వారంతా కచ్చితంగా ఆరు సబ్జెక్టులు రాయాలనే నిబంధన పెట్టింది. అలా మొత్తం పరీక్షలు రాస్తే గతేడాది, ఈ ఏడాది సబ్జెక్టుల వారీగా ఎందులో ఎక్కువ మార్కులొస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. అలాగే వారికి ఫెయిల్‌, కంపార్ట్‌మెంటల్‌, ప్రైవేటు అని లేకుండా మొదటిసారే టెన్త్‌ పాసైనట్లుగా రెగ్యులర్‌ సర్టిఫికెట్లు జారీచేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. టెన్త్‌ పరీక్షల్లో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. 2022, 2023 రెండేళ్లలో సుమారు 1.2 లక్షల మంది విద్యార్థులు టెన్త్‌ ఫెయిలయ్యారు. వారందరినీ తిరిగి బడుల్లో చేర్పించే ప్రయత్నం చేయగా చివరికి 30 వేల మంది రీ అడ్మిషన్‌ పొందారు. రీ అడ్మిషన్‌ తీసుకోని విద్యార్థులు మాత్రం ఎప్పటిలాగే ఫెయిలైన సబ్జెక్టుల వరకు పరీక్షలు రాస్తే సరిపోతుంది. అంటే రీ అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకే ఈ విధానం అన్నమాట. కాగా అన్ని సబ్జెక్టులకు పరీక్షలు రాసే విధానం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది. మళ్లీ మొత్తం రాయాలనే ఆందోళనతో ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది. దానివల్ల మళ్లీ ఫెయిల్‌ అయితే బాధ్యత ఎవరు తీసుకుంటానే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడం కోసం వారి జీవితాలతో ఆడుకుంటోందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే రీఅడ్మిషన్లపై అన్ని వైపులా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Updated Date - 2023-09-30T11:02:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising