ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Notification: మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల్లో ప్రవేశాలు

ABN, First Publish Date - 2023-03-03T11:57:27+05:30

హైదరాబాద్‌ (Hyderabad) లోని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Gurukuls) (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) - రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటర్‌, డిగ్రీ గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ (Admissions) విడుదల చేసింది

ప్రవేశాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్‌ (Hyderabad) లోని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Gurukuls) (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) - రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటర్‌, డిగ్రీ గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ (Admissions) విడుదల చేసింది. రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఆర్‌జేసీ సెట్‌) 2023 ద్వారా ఇంటర్‌ కాలేజీల్లో; రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఆర్‌డీసీ సెట్‌) 2023 ద్వారా డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్స్‌ ఇస్తారు. ఎంట్రెన్స్‌ టెస్ట్‌లలో సాధించిన మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి 1:2 నిష్పత్తిలో కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. డిజిటల్‌ క్లాస్‌లు ఉంటాయి.

ఇంటర్‌ గురుకులాలు

రాష్ట్ర వ్యాప్తంగా 255 జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్స్‌ నిర్వహిస్తారు. వీటిలో బాలురకు కేటాయించిన 130 కళాశాలల్లో మొత్తం 11360 సీట్లు; బాలికలకు కేటాయించిన 125 కళాశాలల్లో మొత్తం 10560 సీట్లు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూప్‌లతోపాటు ఒకేషనల్‌ కోర్సులు - అగ్రికల్చర్‌ అండ్‌ క్రాప్‌ ప్రొడక్షన్‌, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ అండ్‌ యానిమేషన్‌, ప్రీ స్కూల్‌ టీచర్‌ ట్రెయినింగ్‌, కమర్షియల్‌ గార్మెంట్‌ టెక్నాలజీ, మల్టీపర్సప్‌ హెల్త్‌ వర్కర్‌, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫిజియోథెరపీ, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులకు ఐఐటీ, నీట్‌, ఎంసెట్‌, సీఏ/ సీపీటీ, క్లాట్‌ కోచింగ్‌ ఇస్తారు.

అర్హత: ప్రస్తుతం పదోతరగతి/ తత్సమాన పరీక్షలకు సన్నద్దమౌతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే పదోతరగతి పూర్తిచేసినవారు, సప్లిమెంటరీ/ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ అభ్యర్థులు అనర్హులు. కుటుంబ వార్షికాదాయం నగరాల్లో రూ.2,00,000లు; గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000లు మించకూడదు.

పరీక్ష వివరాలు: దీనిని 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఒకేషనల్‌ కోర్సులు సహా అన్ని గ్రూప్‌ల అభ్యర్థులకు ఇంగ్లీష్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఎంపీసీ అభ్యర్థులకు మేథమెటిక్స్‌, ఫిజికల్‌ సైన్స్‌; బైపీసీ అభ్యర్థులకు బయలాజికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌; ఎంఈసీ, సీఈసీ అభ్యర్థులకు మేథమెటిక్స్‌, సోషల్‌ స్టడీస్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఒకేషనల్‌ కోర్సుల్లో హెచ్‌ఈసీ, సీజీఏ, పీఎ్‌సటీటీ, సీజీటీ కోర్సులకు మేథమెటిక్స్‌, సోషల్‌ స్టడీస్‌ నుంచి; ఏసీపీ, టీ అండ్‌ హెచ్‌ కోర్సులకు బయలాజికల్‌ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ నుంచి; ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎంఎల్‌టీ, పీటీ కోర్సులకు బయలాజికల్‌ సైన్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో సబ్జెక్ట్‌ నుంచి 50 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ పదోతరగతి స్థాయిలోనే ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లీష్‌, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. విద్యార్థులు సమాధానాలను ఓఎంఆర్‌ పత్రం మీద గుర్తించాలి. గ్రూప్‌ కోర్సులకు జిల్లాస్థాయి మెరిట్‌ ప్రకారం, ఒకేషనల్‌ కోర్సులకు రాష్ట్ర స్థాయి మెరిట్‌ ప్రకారం ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

డిగ్రీ గురుకులాలు

రాష్ట్ర వ్యాప్తంగా 14 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఆరింటిని మహిళలకు, ఎనిమిది కాలేజీలను పురుషులకు కేటాయించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎ్‌ఫటీ కోర్సులు ఉన్నాయి. గ్రూప్‌ కాంబినేషన్‌ సబ్జెక్టుల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. అన్నింటిలో కలిపి మొత్తం 4560 సీట్లు ఉన్నాయి.

అర్హత: ప్రస్తుతం ఇంటర్‌ రెండో సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తమ్మీద కనీసం 50 శాతం మార్కులు, ఇంగ్లీ్‌షలో కనీసం 40 శాతం మార్కులు రావాలి. ఇన్‌స్టంట్‌ ఎగ్జామ్‌ అభ్యర్థులు అనర్హులు. కుటుంబ వార్షికాదాయం నగరాల్లో రూ.2,00,000లు; గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000లు మించకూడదు.

పరీక్ష వివరాలు: పరీక్ష సమయం రెండున్నర గంటలు. అన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలే ఇస్తారు. మొత్తం మార్కులు 150. అభ్యర్థి ఎంచుకొన్న కోర్సుకు నిర్దేశించిన మూడు సబ్జెక్టులలో ఒక్కోదానిలో 40 మార్కులకు, ఇంగ్లీ్‌షలో 30 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. బీబీఏ, బీకాం(జనరల్‌ కంప్యూటర్స్‌ అండ్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌) కోర్సులకు మాత్రం ఇంగ్లీష్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌ సబ్జెక్టులనుంచి ఒక్కోదానిలో 50 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలన్నీ ఇంటర్‌ సిలబస్‌ ప్రకారమే ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లీష్‌, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. ఓఎంఆర్‌ పత్రం మీద సమాధానాలు గుర్తించాలి. నెగెటివ్‌ మార్కులు లేవు.

ముఖ్య సమాచారం

ఎగ్జామ్‌ ఫీజు: రూ.200

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 16

హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడింగ్‌: ఏప్రిల్‌ 20 నుంచి

ఆర్‌జేసీ సెట్‌ 2023, ఆర్‌డీసీ సెట్‌ 2023 తేదీ: ఏప్రిల్‌ 29న

వెబ్‌సైట్‌: https://mjptbcwreis.telangana.gov.in

Updated Date - 2023-03-03T11:57:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!