ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Notification: ఏపీ ఏకలవ్య గురుకులాల్లో ప్రవేశాలు

ABN, First Publish Date - 2023-03-03T12:40:26+05:30

గుంటూరు (Guntur) లోని ఆంధ్రప్రదేశ్‌ (AP) గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న ఏకలవ్య మోడల్‌ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌

అర్హత వివరాలు ఇలా..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గుంటూరు (Guntur) లోని ఆంధ్రప్రదేశ్‌ (AP) గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న ఏకలవ్య మోడల్‌ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ (Notification) వెలువడింది. రాత పరీక్ష ద్వారా ఆరోతరగతిలో అడ్మిషన్స్‌ ఇస్తారు. అలాగే ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతుల్లో మిగిలిన సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 28 గురుకులాల్లో అడ్మిషన్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్‌లు వర్తిస్తాయి. బోధన ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబ్‌సను అనుసరిస్తారు. తెలుగు మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు దరఖాస్తు ఫారంలో తాము ఎంచుకొన్న గురుకులాల ప్రాధాన్య క్రమాన్ని తప్పనిసరిగా సూచించాలి.

సీట్ల వివరాలు:

  • శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వారీగా కేటాయించిన గురుకులాల్లో ఆరోతరగతిలో మొత్తం 1680 సీట్లు ఉన్నాయి. ప్రతి గురుకులంలో 60 సీట్లు ఉన్నాయి. వీటిలో సగం సీట్లను బాలికలకు ప్రత్యేకించారు.

  • ఏడోతరగతిలో బాలురకు 78, బాలికలకు 48; ఎనిమిదోతరగతిలో బాలురకు 53, బాలికలకు 28; తొమ్మిదోతరగతిలో బాలురకు 24, బాలికలకు 29 బ్యాక్‌లాగ్‌ సీట్లు ఉన్నాయి.

అర్హత వివరాలు

  • ఆరోతరగతిలో చేరాలంటే విద్యార్థులు గుర్తింపు పొందిన పాఠశాలలో అయిదోతరగతి చదివి ఉండాలి. ఇంటిదగ్గరే చదువుకున్న విద్యార్థులు కూడా అర్హులే. వీరికి తల్లిదండ్రులు/ సంరక్షకులు డిక్లరేషన్‌ను సమర్పించాలి. ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతుల్లో చేరే విద్యార్థులు వరసగా ఆరు, ఏడు, ఎనిమిది తరగతులు ఉత్తీర్ణులై ఉండాలి.

  • ఆరోతరగతిలో చేరే విద్యార్థుల వయసు మార్చి 31 నాటికి పదేళ్లు నిండి 13 ఏళ్లలోపు ఉండాలి. ఏడోతరగతికి పదకొండేళ్లు నిండి 14 ఏళ్లలోపు, ఎనిమిదోతరగతికి పన్నెండేళ్లు నిండి 15 ఏళ్లలోపు, తొమ్మిదోతరగతికి 13 ఏళ్లు నిండి 16 ఏళ్లలోపు ఉండాలి. ఠ కుటుంబ వార్షిక ఆదాయం రూ.1,00,000లు మించకూడదు.

రాత పరీక్ష వివరాలు: ఆరోతరగతికి నిర్వహించే పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మెంటల్‌ ఎబిలిటీ నుంచి 50; అర్థమెటిక్‌, తెలుగు అంశాల నుంచి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతులకు నిర్వహించే పరీక్షలు 200 మార్కులకు ఉంటాయి. వీటిలో ఇంగ్లీష్‌, తెలుగు సబ్జెక్టుల నుంచి ఒక్కోదానిలో 10; మేథమెటిక్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల నుంచి ఒక్కోదానిలో 30; సోషల్‌ సైన్స్‌ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో ఇస్తారు.

ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 15

రాత పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 30

మెరిట్‌ జాబితా విడుదల: మే 10న

ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల: మే 17న

వెబ్‌సైట్‌: https://aptwgurukulam.ap.gov.in

Updated Date - 2023-03-03T12:40:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!