ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telugu university: తెలుగు వర్సిటీలో ప్రవేశాలు.. హాస్టల్ సౌకర్యం మాత్రం..!

ABN, First Publish Date - 2023-06-05T11:50:26+05:30

హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం-రెగ్యులర్‌, ఈవెనింగ్‌ ప్రోగ్రామ్‌లలో

Notification
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం-రెగ్యులర్‌, ఈవెనింగ్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్థులు ఆసక్తి మేరకు పీజీ, పీజీ డిప్లొమా, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లలో చేరవచ్చు. హైదరాబాద్‌, వరంగల్‌, రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడి ప్రాంగణాలు వీటిని అందిస్తున్నాయి. రెగ్యులర్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశ పరీక్ష ద్వారా, ఈవెనింగ్‌ కోర్సుల్లో మౌఖిక పరీక్ష ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. హాస్టల్‌ సౌకర్యం ఉంది.

నాంపల్లి ప్రాంగణం-డిజైన్‌ శాఖ

ఎం డిజైన్‌: కోర్సు వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఇంటీరియర్‌ డిజైన్‌, బిజినెస్‌ డిజైన్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్యాషన్‌ ్క్ష టెక్స్‌టైల్‌ డిజైన్‌, ఫిల్మ్‌ డిజైన్‌, యూజర్‌ ఇంటర్ఫే్‌స్క్షడిజైన్‌, ఇండస్ట్రియల్‌ డిజైన్‌ స్పెషలైజేషన్‌లలో ఒక్కోదానిలో 40 సీట్లు ఉన్నాయి. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

బీ డిజైన్‌: కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. ప్రొడక్ట్‌ డిజైన్‌, విజువల్‌ కమ్యూనికేషన్‌, ఇంటీరియర్‌ డిజైన్‌ స్పెషలైజేషన్‌లలో ఒక్కోదానిలో 60 సీట్లు ఉన్నాయి. ఇంటర్‌/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు.

బీఎ్‌ఫటీ: ఇది ఫ్యాషన్‌్క్షటెక్స్‌టైల్‌ డిజైన్‌ కోర్సు. దీని వ్యవధి నాలుగేళ్లు. 60 సీట్లు ఉన్నాయి. ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు.

సర్టిఫికెట్‌ కోర్సులు: ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. రెండు సెమిస్టర్లు ఉంటాయి. యానిమేషన్‌్క్షవీఎ్‌ఫఎక్స్‌, స్టిచ్చింగ్‌్క్షటైలరింగ్‌, యూఐ్క్షయూఎక్స్‌ డిజైన్‌, ఫొటోగ్రఫీ్క్షవీడియో, ఇంటీరియర్‌ డిజైన్‌్క్షడెకరేషన్‌, డ్రాయింగ్‌-పెయింటింగ్‌-మోడలింగ్‌ స్పెషలైజేషన్‌లలో ఒక్కోదానిలో 20 సీట్లు ఉన్నాయి. పదోతరగతి ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు.

నాంపల్లి ప్రాంగణం-ఈవెనింగ్‌ కోర్సులు

ఎంఏ జ్యోతిషం: కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో 70 సీట్లు ఉన్నాయి. ఏదేని డిగ్రీ/ఎంబీబీఎ్‌స/ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు.

పీజీ డిప్లొమా: ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఆంధ్ర నాట్యం-గొల్ల కలాపం, కూచిపూడి యక్షగానం స్పెషలైజేషన్‌లలో ఒక్కోదానిలో 20 సీట్లు ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసి ఉండాలి. లేదంటే కనీసం అయిదేళ్ల ప్రదర్శన అనుభవం తప్పనిసరి. రంగస్థల కళలు, జ్యోతిర్వైద్యం, మూహూర్త విజ్ఞానం, జానపద సంగీతం, జానపద నృత్యం, జానపద వాద్యం, డిక్షనరీ మేకింగ్‌, తెలుగు లాంగ్వేజ్‌ టీచింగ్‌ స్పెషలైజేషన్‌లలో ఒక్కోదానిలో 20 సీట్లు; ఫిల్మ్‌ డైరెక్షన్‌, జ్యోతిర్వాస్తు స్పెషలైజేషన్‌లలో ఒక్కోదానిలో 40 సీట్లు; యోగాలో 60 సీట్లు ఉన్నాయి. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు.

డిప్లొమా: ఏడాది కోర్సులైన జ్యోతిషంలో 40, యోగాలో 100, మిమిక్రీలో 20, ఇంద్రజాలంలో 30 సీట్లు; రెండేళ్ల కోర్సులైన లలిత సంగీతం, పద్య నాటకంలలో ఒక్కోదానిలో 20 సీట్లు ఉన్నాయి. యోగాలో ప్రవేశానికి ఇంటర్‌/ తత్సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి. మిగిలినవాటికి పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసి ఉండాలి.

సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లు: జ్యోతిషం కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో 60 సీట్లు ఉన్నాయి. యోగా కోర్సు వ్యవధి ఆర్నెల్లు. ఇందులో 100 సీట్లు ఉన్నాయి. పదోతరగతి ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు.

పేరిణి కళా ప్రవేశిక: కోర్సు వ్యవధి రెండేళ్లు. 60 సీట్లు ఉన్నాయి. పదేళ్ల వయసు ఉండి తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ప్రావీణ్యం ఉన్నవారు అప్లయ్‌ చేసుకోవచ్చు.

రాజమండ్రి-నన్నయ ప్రాంగణం: ఇక్కడ రెండేళ్ల ఎంఏ (తెలుగు) కోర్సు ఉంది. ఇందులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. మొత్తం 40 సీట్లు ఉన్నాయి. తెలుగు రెండో భాషగా బీఏ/బీకాం/బీఎస్సీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు ఒక సబ్జెక్ట్‌గా డిగ్రీ చదివినవారు కూడా అర్హులే.

శ్రీశైలం-పాల్కురికి సోమనాథ ప్రాంగణం: ఇక్కడ రెండేళ్ల ఎంఏ(చరిత్ర/పురావస్తు శాస్త్రం), ఆరేళ్ల పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి. ఎంఏలో 40 సీట్లు ఉన్నాయి. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. పీహెచ్‌డీలో 9 సీట్లు ఉన్నాయి.

వరంగల్‌-పోతన ప్రాంగణం: ఇక్కడ రెండేళ్ల ఎంఏ(ఫోక్‌ ్క్ష ట్రైబల్‌ స్టడీస్‌), ఆరేళ్ల పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి. ఎంఏలో 40 సీట్లు ఉన్నాయి. ఏదేని డిగ్రీ పూర్తిచేసినవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. పీహెచ్‌డీలో 3 సీట్లు ఉన్నాయి.

బాచుపల్లి ప్రాంగణం

బీఎ్‌ఫఏ: ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. శిల్పం - చిత్రలేఖనం, ప్రింట్‌ మేకింగ్‌ స్పెషలైజేషన్‌లు ఎంచుకోవచ్చు. మొత్తం 60 సీట్లు ఉన్నాయి. ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు.

బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఇందులో 60 సీట్లు ఉన్నాయి. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు.

ఎంఎ్‌ఫఏ: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. శిల్పం - చిత్రలేఖనం, ప్రింట్‌ మేకింగ్‌ స్పెషలైజేషన్‌లు ఎంచుకోవచ్చు. మొత్తం 50 సీట్లు ఉన్నాయి. బీఎ్‌ఫఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంఏ: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ స్పెషలైజేషన్‌లో 70, అనువర్తిత భాషాశాస్త్రంలో 50, తెలుగులో 70, హిస్టరీ-కల్చర్‌-టూరిజంలో 50 సీట్లు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏ/బీకాం/బీఎస్సీ/ బీఎ్‌ఫఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు. తెలుగు స్పెషలైజేషన్‌కు మాత్రం ఏ డిగ్రీలోనైనా తెలుగును ద్వితీయ భాషగా/ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. కర్ణాటక సంగీతం(గాత్రం - మృదంగం-వీణ, వయొలిన్‌) స్పెషలైజేషన్‌లో 40 సీట్లు ఉన్నాయి. కర్ణాటక సంగీతంలో డిగ్రీ ఉత్తీర్ణులు; ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతపాటు సంగీతంలో డిప్లొమా పూర్తిచేసినవారు; ఆకాశవాణి ‘బి’ గ్రేడ్‌ ఆర్టి్‌స్టలు అప్లయ్‌ చేసుకోవచ్చు.

ఎంపీఏ: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. కూచిపూడి/ఆంధ్రనాట్యం 40, జానపద కళలు 70, రంగస్థల కళలు 40 సీట్లు ఉన్నాయి. సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణులు; ఏదేని డిగ్రీతోపాటు సంబంధిత సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసినవారు/ కనీసం అయిదేళ్ల ప్రదర్శన అనుభవం ఉన్నవారు; రేడియో/ దూరదర్శన్‌ ఆర్టి్‌స్టలు అప్లయ్‌ చేసుకోవచ్చు. జానపద కళలకు మాత్రం డిగ్రీ స్థాయిలో తెలుగు సెకండ్‌ లాంగ్వేజ్‌గా/ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.

పీహెచ్‌డీ: భాషాశాస్త్ర శాఖలో 6, కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజంలో 2, సంగీతంలో 4, నృత్యంలో 1, రంగస్థలంలో 4, జానపద కళల్లో 2 సీట్లు ఉన్నాయి. కోర్సు వ్యవధి ఆరేళ్లు.

శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠం

ఎంపీఏ (కూచిపూడి నృత్యం): కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో 40 సీట్లు ఉన్నాయి. సంబంధిత డిగ్రీ ఉన్నవారు అర్హులు.

పీజీ డిప్లొమా ఇన్‌ అన్నమయ్య పద నృత్యం: ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. ఇందులో 20 సీట్లు ఉన్నాయి. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ కాలేజ్‌ నుంచి సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసి ఉండాలి.

డిప్లొమా: రెండేళ్ల కూచిపూడి నృత్యం; ఏడాది వ్యవధిగల యక్షగానం, సాత్వికాభినయం కోర్సులు ఉన్నాయి. ఒక్కోదానిలో 30 సీట్లు ఉన్నాయి. పదోతరగతితోపాటు సంబంధిత సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసినవారు అర్హులు.

సర్టిఫికెట్‌ కోర్సులు: నాలుగేళ్ల కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీతం (గాత్రం/ మృదంగం/ వయొలిన్‌) కోర్సులు ఉన్నాయి. ఒక్కోదానిలో 50 సీట్లు ఉన్నాయి. కనీసం పదేళ్ల వయసు ఉండి తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం ఉన్నవారు అప్లయ్‌ చేసుకోవచ్చు.

కళా ప్రవేశిక - కూచిపూడి నృత్యం: కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో 50 సీట్లు ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ప్రావీణ్యం; నృత్యంపై ఆసక్తి ఉన్నవారు అర్హులు.

ప్రవేశ పరీక్ష: రెగ్యులర్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో మొత్తం 100 మార్కులకు మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. లలితకళాపీఠంలోని కోర్సులకు నిర్వహించే పరీక్షలో సిద్ధాంతం, ప్రాయోగికం అంశాల్లో ఒక్కోదానికి 50 మార్కులు కేటాయించారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాలంటే జనరల్‌ అభ్యర్థులకు 36 శాతం; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 15 శాతం మార్కులు రావాలి. నిర్ణీత సీట్ల కంటే తక్కువ దరఖాస్తులు వస్తే అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: పీహెచ్‌డీకి రూ.1000; మిగిలిన కోర్సులకు రూ.500

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 17

ప్రవేశ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడి ప్రాంగణాలు

వెబ్‌సైట్‌: teluguuniversity.ac.in

Updated Date - 2023-06-05T11:50:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising