ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Private schools: ప్రైవేటు స్కూళ్ల నయా దందా! ఫైన్‌ పేరుతో జేబులు గుల్ల!

ABN, First Publish Date - 2023-02-27T12:33:04+05:30

‘‘నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు’’ అన్నట్లుగా నగరంలోని కొన్ని పేరొందిన స్కూళ్లు వ్యవహరిస్తున్నాయి. కార్పొరేట్‌ విద్య పేరుతో కాసుల కోసం వేధిస్తున్నాయి. ఫీజు

జేబులు గుల్ల!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రైవేటు స్కూళ్ల ఫీ‘జులుం’

ప్రతి నెలా రూ.300 చొప్పున

మరింత ఆలస్యమైతే దానిపైనా..

వార్షిక పరీక్షల సమయంలో వేధింపులు

1,886 ప్రైవేట్‌ పాఠశాలలు

6.80 లక్షల మంది విద్యార్థులు

ఏటా 15 నుంచి 20 శాతం ఫీజుల పెంపు

‘‘నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు’’ అన్నట్లుగా నగరంలోని కొన్ని పేరొందిన స్కూళ్లు వ్యవహరిస్తున్నాయి. కార్పొరేట్‌ విద్య పేరుతో కాసుల కోసం వేధిస్తున్నాయి. ఫీజు చెల్లించడం ఆలస్యమైనా ఫైన్‌ పేరుతో పిల్లల తల్లిదండ్రుల జేబులు గుల్లజేస్తున్నాయి.

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్‌ పాఠశాలల (Corporate schools) ఫీజుల దందా శ్రుతిమించుతోంది. నెలవారీ ఫీజులపై కూడా ఫైన్‌లు (Fine) విధిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 1,886 ప్రైవేట్‌ పాఠశాలలున్నాయి. ఇందులో సుమారు 6.80 లక్షల మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇంటర్నేషనల్‌, కార్పొరేట్‌, టెక్నో విద్యా సంస్థల్లో ఫీజుల భారం ఎక్కువగా ఉన్నప్పటికీ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు (parents) అందులోనే చదివిస్తున్నారు. డొనేషన్స్‌, వార్షిక ఫీజులు చెల్లిస్తూ, నోట్‌బుక్స్‌, యూనిఫాం, షూస్‌, తదితర సామగ్రి కూడా పాఠశాలల్లోనే తీసుకుంటున్నారు. యాజమాన్యాలు ఇప్పటికే తిరుపతిరావు కమిటీ సూచనలను ఉల్లంఘిస్తూ ఏటా 15 నుంచి 20 శాతం ఫీజులను పెంచుతున్నాయి. అయితే, కొన్ని స్కూళ్లు కొంతకాలంగా కొత్త దోపిడీకి పాల్పడుతున్నాయి. విద్యార్థులకు సంబంధించిన నెలవారీ ఫీజుల (Fees) చెల్లింపులు కొంత ఆలస్యమైతే ఫైన్‌ వసూలు చేస్తున్నాయి.

అవాక్కవుతున్న తల్లిదండ్రులు

ఇటీవల అంబర్‌పేటలోని ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో (International School) మూడో తరగతి చదువుతున్న విద్యార్థి తండ్రికి వింత అనుభవం ఎదురైంది. కరోనాకు ముందు మూడు నెలలకోసారి టర్మ్‌ ఫీజు తీసుకున్న యాజమాన్యం, గత విద్యాసంవత్సరం నుంచి ట్యూషన్‌ ఫీజు (Tuition fee) కింద ప్రతి నెలా వసూలు చేస్తోంది. నెలకు రూ.7 వేల ఫీజు ఉండగా, సదరు విద్యార్థి తండ్రి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏడు నెలల పాటు ఫీజు చెల్లించలేక పోయాడు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో యాజమాన్యం ఒత్తిడితో ఇటీవల అప్పు చేసి పెండింగ్‌ ఫీజు చెల్లించేందుకు వెళ్తే.. అసలు ఫీజుతో పాటు ఫైన్‌లు కూడా చెల్లించాలని యాజమాన్యం చెప్పడంతో అవాక్కయ్యాడు. ప్రతి నెలా కట్టాల్సిన ఫీజుతో పాటు రూ.300 ఫైన్‌ విధించారు. ఫీజు మొత్తం మాత్రమే తీసుకెళ్లిన విద్యార్థి తండ్రి జరిమానా చెల్లించలేనంటే, కట్టే వరకూ ప్రతి పది రోజులకు మరో రూ. 100 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని చెప్పారట. దీంతో విద్యార్థి తండ్రి ఆందోళన చెందాడు. ఫైన్‌తో పాటు పూర్తి ఫీజు చెల్లించకుంటే విద్యార్థిని పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వబోమని హెచ్చరించడంతో అప్పు చేసి ఫీజు చెల్లించాడు. ఫీజు చెల్లించడమే కష్టంగా ఉన్న తరుణంలో ఫైన్‌లు ఏంటని ప్రశ్నిస్తే, యాజమాన్యం తనతో దురుసుగా మాట్లాడిందని వాపోయారు. కొన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థల అక్రమాలపై జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఫీజులపై ఫెనాల్టీలు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జావిద్‌ హెచ్చరించారు.

Updated Date - 2023-02-27T12:34:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising