AP ECET నోటిఫికేషన్.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..!
ABN, First Publish Date - 2023-03-16T16:26:03+05:30
ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) -స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీఈసెట్) 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షని
ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) -స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీఈసెట్) 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షని కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూకే) నిర్వహిస్తోంది. దీని ద్వారా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సులకు సంబంధించి రెండో సంవత్సరంలో (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాలు కల్పిస్తారు. ఈసెట్‌లో సాధించిన ర్యాంక్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ, నాన్ మైనారిటీ ప్రొఫెషనల్ కళాశాలల్లో అడ్మిషన్స్ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష సిలబస్, మాక్ టెస్ట్‌ల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
విభాగాలు: అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, సిరామిక్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్స్ ఇంజనీరింగ్, ఎలకా్ట్రనిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఫార్మసీ
అర్హత వివరాలు: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(టీఎ్‌స/ఏపీ) నుంచి ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ ఫార్మసీ విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. మేథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా మూడేళ్ల బీఎస్సీ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా/డిగ్రీ స్థాయిలో కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాల అభ్యర్థులకు 40 శాతం మార్కులు చాలు.
ఏపీ ఈసెట్ వివరాలు: పరీక్ష సమయం మూడు గంటలు. మొత్తం మార్కులు 200. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే కనీసం 25 శాతం మార్కులు రావాలి.
డిప్లొమా అభ్యర్థులకు నిర్వహించే పరీక్షలో మేథమెటిక్స్ నుంచి 50, ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25, సంబంధిత ఇంజనీరింగ్ విభాగం(సివిల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్/ కెమికల్/ మెటలర్జికల్/మైనింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్)నుంచి 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
బీఎస్సీ(మేథమెటిక్స్) అభ్యర్థులకు మేథమెటిక్స్ నుంచి 100, అనలిటికల్ ఎబిలిటీ నుంచి 50, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నుంచి 50 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.
ఫార్మసీ అభ్యర్థులకు ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ, ఫార్మకాలజీ అంశాలనుంచి ఒక్కోదానిలో 50 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600; బీసీ అభ్యర్థులకు రూ.550; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 10
కరక్షన్ విండో ఓపెన్: ఏప్రిల్ 20 నుంచి 22 వరకు
హాల్‌టికెట్స్ డౌన్‌లోడింగ్: ఏప్రిల్ 28 నుంచి
ఏపీ ఈసెట్ 2023 తేదీ: మే 5
వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/ECET
Updated Date - 2023-03-16T16:26:03+05:30 IST