ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Education: ఇంటర్ విద్యార్థులకు నిరాశ! కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ!

ABN, First Publish Date - 2023-04-20T12:39:37+05:30

ఎంసెట్‌ ర్యాంకుల్లో (EMSET Rank) ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ (Weightage of inter marks) విధానాన్ని రద్దు చేస్తూ విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు

Education
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంసెట్‌ ర్యాంకుల్లో.. ‘ఇంటర్‌’ వెయిటేజ్‌ రద్దు

ఇకపై ఎంసెట్‌ స్కోర్‌తోనే ర్యాంకులు

ఈ యేడాది నుంచే అమల్లోకి: విద్యా శాఖ ఉత్తర్వులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఎంసెట్‌ ర్యాంకుల్లో (EMSET Rank) ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ (Weightage of inter marks) విధానాన్ని రద్దు చేస్తూ విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం రాబోయే సంవత్సరాలకు కూడా వర్తించనుంది. దీంతో ఇక నుంచి ఎంసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులను ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం ఎంసెట్‌ నిర్వహిస్తున్నారు. గతంలో ఉన్న విధానం ప్రకారం.. ఎంసెట్‌లో స్కోర్‌ చేసే మార్కులను 75 శాతంగా పరిగణనలోకి తీసుకుని, ఇంటర్‌లో వచ్చిన మార్కులకు 25 శాతం వెయిటేజ్‌ ఇచ్చి ర్యాంకులను ప్రకటించే వారు. ఈ విధానం ద్వారా ఎంసెట్‌లో కొంత తక్కువ మార్కులు వచ్చినా.. ఇంటర్‌లో ఎక్కువ మార్కులు సాధించే విద్యార్థులకు.. ఎంసెట్‌ ర్యాం కుల్లో మెరుగైన స్థానం ఉండేది. అయితే.. జాతీయ స్థాయిలో నిర్వహించే అనేక ప్రవేశ పరీక్షల్లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజ్‌ లేదు. ఇక, కరోనా సమయంలో ఇంటర్‌ పరీక్షలను రద్దు చేశారు. దాంతో ఆ సమయంలో వెయిటేజ్‌ని తొలగించారు. అదే విధానాన్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వృత్తి విద్యా కోర్సుల్లో 45 % మార్కులు తప్పనిసరి..

వృత్తి విద్యా కోర్సుల్లో చేరాలంటే ఇంటర్‌లో 45 శాతం మార్కులను సాధించాలనే నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరాలంటే ఇంటర్‌లో జనరల్‌ కేటగిరీ విద్యార్థులు 45 శాతం, రిజర్వేషన్‌ విద్యార్థులు 40 శాతం మార్కులు సాధించాలి. అయితే, కరోనా సమయంలో వృత్తి విద్యా కోర్సుల్లో చేరడానికి 45 శాతం మార్కుల నిబంధనను తొలగించారు. ఈ ఏడాది నుంచి మళ్లీ ఆ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించారు.

Updated Date - 2023-04-20T12:39:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising