ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SSC Hall tickets: టెన్త్‌ హాల్‌ టికెట్లు విడుదల

ABN, First Publish Date - 2023-03-24T17:40:22+05:30

తెలంగాణ (Telangana)లో ఏప్రిల్ 3 నుంచి జరగబోయే పదో తరగతి (Tenth Exam) వార్షిక పరీక్షల హాల్‌టికెట్ల (Hall tickets)ను ఎస్‌ఎస్‌సీ(SSC) బోర్డు విడుదల చేసింది. విద్యార్థులు హాల్‌టికెట్లను https://bse.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని

Telangana SSC Hall tickets
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్‌: తెలంగాణ (Telangana)లో ఏప్రిల్ 3 నుంచి జరగబోయే పదో తరగతి (Tenth Exam) వార్షిక పరీక్షల హాల్‌టికెట్ల (Hall tickets)ను ఎస్‌ఎస్‌సీ(SSC) బోర్డు విడుదల చేసింది. విద్యార్థులు హాల్‌టికెట్లను https://bse.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పరీక్షల విభాగం డైరెక్టర్‌ రమేశ్‌ తెలిపారు. ఏప్రిల్‌ 3 నుంచి 18వ తారీఖు వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థుల కోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వెబ్‌సైట్‌లో జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని ఎంటర్‌ చేసి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

హాల్‌టికెట్లను స్కూల్‌ నుంచి తీసుకోవచ్చని లేదా వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పరీక్షల విభాగం డైరెక్టర్‌ వెల్లడించారు. డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌పై ప్రధానోపాధ్యాయుడి సంతకం లేకున్నా పరీక్షకు అనుమతిస్తామన్నారు. ఇక తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (టాస్‌) పరిధిలో చదువుకుంటున్న టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులకు ఏప్రిల్‌ 25 నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. మే 4న ఇవి పూర్తవుతాయి.

Updated Date - 2023-03-24T17:45:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising