ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TET: మళ్లీ టెట్..! పోస్టుల భర్తీ ఎప్పుడో..!

ABN, First Publish Date - 2023-07-08T12:02:26+05:30

ఉపాధ్యాయ అర్హత పరీక్షను(టెట్‌) త్వరలోనే మళ్లీ నిర్వహించాలని విద్యాశాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యాశాఖపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం

చివరిగా గతేడాది జూన్‌లో పరీక్ష

టీచర్ పోస్టుల భర్తీపై చర్చ లేదు

రాష్ట్రంలో ఖాళీగా 24 వేల పోస్టులు

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్షను(టెట్‌) త్వరలోనే మళ్లీ నిర్వహించాలని విద్యాశాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం నాడు ప్రత్యేకంగా సమావేశమై టెట్‌, మన ఊరుమన బడి తదితర అంశాలపై చర్చించింది. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, తలసాని శ్రీనివాస్‌, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో టీచర్‌ పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయడానికి ముందు టెట్‌ను నిర్వహించాలన్న డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే టెట్‌ పరీక్షను నిర్వహించాలని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయం తీసుకొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు మూడు సార్లు టెట్‌ నిర్వహించారు. చివరిసారిగా గతేడాది జూన్‌ 12న ఈ పరీక్ష జరిగింది. ఇదిలా ఉండగా, మన ఊరుమన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో చేపట్టిన బడుల అభివృద్ది పనులపై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను ఇచ్చారు. మొదటి దశ కార్యక్రమం అనుకున్న విధంగా జరగలేదన్న అభిప్రాయాన్ని మంత్రులు ఈ సందర్భంగా వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో, మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు, కొత్తగా రెండవ దశ పనులను కూడా చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో టీచర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని ఏడాది క్రితం సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. ఈ అంశంపై శుక్రవారం క్యాబినెట్‌ సబ్‌కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని భావించారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారిగా 2017లో 13,500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియను చేపట్టలేదు. రాష్ట్రంలో సుమారు 24వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం.

Updated Date - 2023-07-08T12:02:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising