ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Suspended: మధిర గురుకుల ప్రిన్సిపాల్‌పై వేటు

ABN, First Publish Date - 2023-02-21T12:57:24+05:30

భోజనం బాగా లేదన్న పదో తరగతి (10th class students) విద్యార్థినులపై దాష్టీకం ప్రదర్శించిన మధిర (Madhira)లోని జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల

వేటు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సస్పెండ్‌ చేస్తూ ఖమ్మం కలెక్టర్‌ ఉత్తర్వులు

మధిర, ఫిబ్రవరి 20: భోజనం బాగా లేదన్న పదో తరగతి (10th class students) విద్యార్థినులపై దాష్టీకం ప్రదర్శించిన మధిర (Madhira)లోని జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ నసీమాపై వేటు పడింది. ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఖమ్మం కలెక్టర్‌ గౌతమ్‌ (Khammam Collector Gautham) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ప్రిన్సిపాల్‌గా ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లి పాఠశాల ప్రిన్సిపాల్‌ (Principal)గా ఉన్న నిరూషను రెగ్యులర్‌ ప్రిన్సిపాల్‌గా నియమించారు. గురుకుల పాఠశాలలో భోజనం బాగా లేదన్నందుకు ఈ నెల 18న పదో తరగతి విద్యార్థినులను నసీమా చితక బాదారు. ఈ ఘటనపై రీజినల్‌ కోఆర్డినేటర్‌ జ్యోతి ఆదివారం విచారణ జరిపారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ‘భోజనం బాలేదంటే చితకబాదారు’ శీర్షికన సోమవారం కథనాన్ని ప్రచురించింది. అయితే, విచారణ పూర్తి చేసినా.. నివేదిక ఇవ్వకపోవడంపై ఆర్‌సీవో జ్యోతిపై కలెక్టర్‌ గౌతమ్‌ సీరియస్‌ అయ్యారు. గ్రీవెన్స్‌ సెల్‌లో సదరు అధికారిని పిలిపించి మందలించారు. ఎట్టకేలకు ఆమె నివేదిక అందజేయడంతో ప్రిన్సిపాల్‌ నసీమాపై వేటు పడింది. కాగా, మధిరలోని జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలను ఖమ్మం జిల్లా లీగల్‌సెల్‌ అథారిటీ న్యాయమూర్తి జావెద్‌ పాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేసి, నాణ్యతను పరిశీలించారు.

Updated Date - 2023-02-21T12:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising