ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayurveda: చలికాలంలో జ్యూసులు తాగడం మంచిదేనా? ఆయుర్వేదం ఏం చెబుతోందంటే..!

ABN, Publish Date - Dec 28 , 2023 | 11:45 AM

జ్యూసులలో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ ఆయుర్వేదం ఏం చెబుతోందంటే..

చలికాలంలో కనీసం మంచినీళ్లు కూడా ఎక్కువగా తాగబుద్దేయదు. వెచ్చని వాతావరణంలో ఉండాలని, వెచ్చని ఆహారాలు తీసుకోవాలని కోరుకుంటారు. కానీ ఆరోగ్య స్పృహ ఉన్నవారు మాత్రం సీజన్ తో సంబంధం లేకుండా పచ్చి కూరగాయలు, జ్యూసులు తాగుతారు. ఇది ఆరోగ్యానికి మంచిదేనా అంటే కాదని చెబుతోంది ఆయుర్వేదం.చలికాలంలో జ్యూసులు ఎందుకు తాగకూడదు? ఆరోగ్యం కోసం ఏ జ్యూసులు తాగితే మంచిది? ఆయుర్వేదం ఏం చెబుతోంది? పూర్తీగా తెలుసుకుంటే..

ఆయుర్వేదం ప్రకారం చలికాలంలో జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. జ్యూస్ తాగడం వల్ల అలసట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. జ్యూసులలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉన్నా సరే.. ఏవి పడితే అవి తాగకూడదు. చలికాలానికి మాత్రమే నిర్థేశించిన జ్యూసులను తీసుకోవడం మంచిది. జ్యూసులలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చక్కెర నిల్వలు పేరుకుపోయేలా చేస్తుంది. చాపకింద నీరులా బరువు పెరగడానికి కూడా కారణం అవుతుంది. అందుకే చలికాలంలో ఎక్కువగా జ్యూసులు తాగకూడదు. పైగా ఇవి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి. వీటిని తాగితే దగ్గు, జలుబు, అజీర్ణం, వాంతులు వంటి సమస్యలొస్తాయి. అందుకే చలికాలంలో కింద పేర్కొన్న జ్యూసులు మాత్రమే మితంగా తాగాలి.

ఇది కూడా చదవండి: ఇవి అలవాటు చేసుకుంటే.. కొత్త ఏడాదిలో మీరే కింగ్..!


ఆరెంజ్ జ్యూస్..(Orange Juice)

ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో జలుబు, ఫ్లూ వంటి సమస్యలతో పోరడడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వాపులు తగ్గించడంలోనూ, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ సహాయపడతాయి.

క్రాన్బెర్రీ జ్యూస్..(Cranberry juice)

క్రాన్బెర్రీ జ్యూస్ దానిమ్మ జ్యూస్ లా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఇది జీర్ణక్రియను పెంచుతుంది. కడుపులో మంట తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో టాక్సిన్లు తొలించడంలో సహాయపడుతుంది. ఇన్పెక్షన్ ప్రమాదాల నుండి రక్షిస్తుంది.

ఆపిల్, బీట్ రూట్, క్యారెట్ జ్యూస్ (ఎబిసి)(ABC-Apple, Beetroot, Carrot)

ఆపిల్, బీట్ రూట్, క్యారెట్ మూడు కలిపి జ్యూస్ చేసుకుని తాగితే ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. ఈ జ్యూస్ లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్, మెగ్నీషఇయం, పొటాషియం, ఫోలెట్ వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి.

ఇది కూడా చదవండి: వెల్లుల్లి పొట్టు పడేస్తున్నారా? ఈ నిజాలు తెలిస్తే!

(గమనిక: ఇది ఆహార నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న విషయాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏమైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Updated Date - Dec 28 , 2023 | 11:45 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising