Almonds: ఇవి తింటే ఆ ముప్పు తప్పుతుంది
ABN, First Publish Date - 2023-02-17T12:34:55+05:30
బాదం వంటి పప్పుగింజలు గుండె సంబంధ వ్యాధుల (Cardiac diseases) ప్రమాదాన్ని కూడా
కొలెస్ట్రాల్‌నూ తగ్గిస్తుంది: అధ్యయనం
న్యూఢిల్లీ: బాదంపప్పు (Almonds)ను క్రమం తప్పకుండా తినడం మధుమేహం (diabetes)ముప్పును తగ్గిస్తుందని ఓ అధ్యయనం పేర్కొంది. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ (Cholesterol)ను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుందని తెలిపింది. అధిక బరువు, ఊబకాయం ఉన్నవారు రోజూ బాదంపప్పును తీనుకోవడం వల్ల శరీర బరువుతో పాటు బ్లడ్ షుగర్ (Blood sugar)స్థాయులు కూడా మెరుగుపడతాయని వెల్లడించింది. 12 వారాల పాటు ప్రతిరోజూ బాదంపప్పు తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గిపోయి ప్యాంక్రియాస్ పనితీరు మెరుగుపడుతుందని, రక్తంలో గ్లూకోజ్ స్థాయులను నియంత్రించడంలో సహాయపడుతుందని గుర్తించారు. రోజూ బాదంపప్పు తిన్నవారిలో శరీర బరువు, బీఎంఐ, నడుము చుట్టుకొలతతో పాటు మొత్తం కొలెస్ట్రాల్‌లో కూడా గణనీయమైన తగ్గుదలను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగమైన బాదం వంటి పప్పుగింజలు గుండె సంబంధ వ్యాధుల (Cardiac diseases) ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని వివరించారు. 25నుంచి 65 సంవత్సరాల వయసున్న 400 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. చెన్నైకి చెందిన మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అధ్యయనం వివరాలు ‘ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్’ అనే జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి.
Updated Date - 2023-02-17T12:35:07+05:30 IST