ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Egg Diet: అసలేంటీ ఎగ్ డైట్.. బరువు తగ్గడానికి దీనికి లింకేంటంటే..

ABN, Publish Date - Dec 17 , 2023 | 05:43 PM

శరీర స్థితిని బట్టి బోలెడు డైటే ప్లాన్ లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ ఎగ్ డైట్ రూటే సపరేటు..

గుడ్లు పోషకాహారంలో భాగమని అందరికీ తెలిసిందే. పిల్లల నుండి గర్బవతులు, పెద్దలు ఇలా అందరూ రోజుకొక గుడ్డు తింటే శరీరం ధృడంగా ఉంటుందని, పోషకాహార లోపం దరిచేరదని అంటూంటారు. శరీరం ధృడంగా ఉండటానికి, బరువు నియంత్రించుకోవడానికి, గర్భవతులకు, తక్కువ పనిచేసేవారికి, క్రీడాకారులకు, అందం కాపాడుకోవడానికి ఇలా ఒకటనేమిటి.. ఒక్కో అవసరానికి ఒక్కో డైట్ ప్లాన్ ఫాలో అవుతుంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎగ్ డైట్(Egg diet) వైరల్ అవుతోంది. అసలు ఈ ఎగ్ డైట్ ఏంటి? దీని ప్రయోజనాలేంటి? ఎగ్ డైట్ వల్ల బరువు తగ్గుతారా? వివరంగా తెలుసుకుంటే..

ఆహారంలో మాంసాహారం తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ప్రోటీన్ లభిస్తుందని చాలా మంది అనుకుంటారు. అయితే మాంసాహారం తీసుకోనివారు, బరువు తగ్గాలనే ఆలోచనలో ఉన్నవారు ఎగ్ డైట్ ఫాలో అవ్వచ్చట. ఈ ఎగ్ డైట్ లో ప్రధానంగా ఉడికించిన గుడ్లు తినాల్సి ఉంటుంది. రోజులో కనీసం రెండు నుండి మూడు గుడ్లు తినాలి.

ఇది కూడా చదవండి: Walking: వాకింగ్ చేసేటప్పుడు ఈ 5 పొరపాట్లు చేయకండి.. చాలా నష్టపోతారు!!



ఉదయం తీసుకునే అల్పాహారం ఎంత శక్తివంతంగా ఉంటే రోజంతా అంత ఉత్సాహంగా ఉంటారని చెబుతారు. దీనికి అనుగుణంగా ఉదయాన్నే రెండు గుడ్లు, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న కూరగాయలు, వీటితో పాటు ఒక పండు తీసుకోవాలి. ఇది ఎగ్ డైట్ లో అల్పాహారం.

మధ్యాహ్నం భోజనంలో లీన్ ప్రోటీన్, కార్న్ వెజిటేబుల్ సూప్, ఒక గుడ్డు తీసుకోవాలి.

రాత్రి సమయంలో లీన్ ప్రోటీన్, ఒక గుడ్డు తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న కూరగాయలు తీసుకోవాలి.

ఇది కూడా చదవండి: పిల్లలలో మొబైల్ వ్యసనం.. ఈ పనులు చేస్తే మాయం!


మూడుపూటలా ఇలా గుడ్డును డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. కానీ కేలరీలు మాత్రం తక్కువగానే ఉంటాయి. దీంతో బరువు తగ్గాలని అనుకునేవారి నుండి బరువు నియంత్రణలో ఉంచుకోవాలని అనుకునేవారి వరకు అందరూ ఈ ఎగ్ డైట్ ను ఫాలో అవుతున్నారు. ఉడకబెట్టిన గుడ్లు ఎక్కువసేపు ఆకలిని నియంత్రిస్తాయి. ఈ డైట్ ను హాలీవుడ్ సెలబ్రిటీ నికోల్ కిడ్ మాన్ ఫాలో అయ్యి మెరుగైన ఫలితాలు పొందిన తరువాత దీని గురించి సానుకూలంగా స్పందించారు. అప్పటినుండి ఎగ్ డైట్ వైరల్ అవుతోంది.

(గమనిక: ఇది ఆహార నిపుణులు, వైద్యులు , పలు వేదికలు పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

ఇది కూడా చదవండి: జ్ఞాపకశక్తిని పెంచే సూపర్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 17 , 2023 | 05:43 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising