ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pregnancy: అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం... అలా చేయొచ్చా!

ABN, First Publish Date - 2023-06-08T13:56:18+05:30

డాక్టర్‌! మాకు ఇటీవలే పెళ్లైంది. నా వయసు 28. ఇప్పుడే పిల్లలను కనాలని

Pregnancy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డాక్టర్‌! మాకు ఇటీవలే పెళ్లైంది. నా వయసు 28. ఇప్పుడే పిల్లలను కనాలని లేదు. కానీ ఆలస్యం చేస్తే పిల్లలను కనే అవకాశాలు తగ్గుతాయని భయంగా ఉంది. నిజానికి ప్రెగ్నెన్సీని ఎలా ప్లాన్‌ చేసుకోవాలి?

– ఓ సోదరి, హైదరాబాద్‌.

20, 22 ఏళ్ల వయసు గర్భధారణకు అనువైన వయసు. ఈ వయసులో నాణ్యమైన అండాలను కలిగి ఉంటారు. గర్భధారణ జరిగే అవకాశాలు కూడా ఈ వయసు మహిళలకే ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పటి రోజుల్లో ఈ వయసులో పెళ్లిళ్లకు సిద్ధపడే అమ్మాయిలు చాలా తక్కువ. అయితే ఉన్నత చదువులు, కెరీర్‌ కోసం ఇంకొంత సమయాన్ని తీసుకోవాలనుకునే అమ్మాయిలు కనీసం 25 నుంచి 30, 32 ఏళ్ల లోపు తొలి బిడ్డను ప్రసవించేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఈ వయసు మహిళల్లో గర్భధారణ అవకాశాలు ప్రతి నెలలో, 25 శాతం మేరకు ఉంటాయి. ప్రసవాలకు మధ్య స్పేసింగ్‌ కూడా మెరుగ్గా ఉండేలా చూసుకోవచ్చు. అయితే ఈ వయసు కూడా దాటిపోయి 35 ఏళ్లకు చేరుకునేటప్పటికి అండాల నాణ్యత తగ్గుముఖం పడుతుంది. దాంతో గర్భధారణ అవకాశాలు తగ్గి, ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలు పెరుగుతాయి. ఈ సమస్యలను సరిదిద్దుకుని గర్భం దాల్చే సమయానికి వయసు మరింత పెరిగిపోతుంది. కాబట్టి వీలైనంత ముందుగానే 30 ఏళ్ల లోపే గర్భాన్ని ప్లాన్‌ చేసుకోవడం ఉత్తమం.

గర్భధారణ ప్లానింగ్‌ ఇలా...

గర్భం ధరించాలని ప్లాన్‌ చేసుకునే మహిళలు మూడు నెలల ముందు నుంచే శరీరాన్ని సిద్ధం చేయాలి.

ఫోలిక్‌ యాసిడ్‌: బిడ్డ నాడీ వ్యవస్థ ఎదుగుదలకు తోడ్పడే పోషకం ఇది. ఫోలిక్‌ యాసిడ్‌ లోపంతో గర్భంలోని బిడ్డలో స్కాల్ప్‌ ఏర్పడదు. అలాగే కొన్ని వెన్ను సంబంధ లోపాలు కూడా తలెత్తవచ్చు. ఈ సమస్యలన్నిటినీ ఫోలిక్‌ యాసిడ్‌తో నియంత్రించవచ్చు. కాబట్టి గర్భధారణకు కొన్ని నెలల ముందు నుంచే ఫోలిక్‌ యాసిడ్‌ తీసుకోవడం అవసరం.

ఆరోగ్య సమస్యలు: థైరాయిడ్‌, మధుమేహం, రక్తలేమి లాంటి సమస్యలేవీ లేవని పరీక్షలతో నిర్థారించుకోవాలి. ఆ సమస్యలను అదుపులో ఉంచుకోవాలి. రక్తలేమితో గర్భం దాల్చడం వల్ల పిల్లలు తక్కువ బరువుతో లేదా నెలలు నిండకుండా పుట్టే అవకాశాలుంటాయి.

అధిక బరువు: బరువు ఎక్కువగా ఉంటే, దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి.

డైట్‌: జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉంటూ, ప్రొటీన్‌ ఎక్కువగా, పిండి పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, సిట్రస్‌ పండ్ల్లు, హీమోగ్లోబిన్‌ కోసం ముదురు రంగు పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి. స్వీట్లు బాగా తగ్గించాలి.

వ్యాయామం: వృత్తుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కనీసం వారంలో ఐదు రోజుల పాటైనా రోజుకు 45 నిమిషాల పాటు వ్యాయామానికి కేటాయించాలి. ఇలా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సాధించినా గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయి.

సప్లిమెంట్లు: పోషక లోపాలుంటే, వాటిని వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లతో భర్తీ చేసుకోవాలి.

-డాక్టర్‌ ప్రత్యూష రెడ్డి

అబ్‌స్టెట్రీషియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్‌,

హైదరాబాద్‌.

Updated Date - 2023-06-08T13:56:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising