Spices: చలికాలంలో శరీర ఉష్ట్రోగ్రత నిలకడగా ఉండట్లేదా.. వంటింట్లో ఉండే వీటిని ట్రై చేస్తే..!
ABN, Publish Date - Dec 21 , 2023 | 03:23 PM
చలికాలపు సీజనల్ వ్యాధులను నివారించి, శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో ఈ వంటింటి దినుసులు చక్కగా సహాయపడతాయి.
చలికాలంలో వాతావరణం చాలా మారిపోతుంది. దీని ప్రభావం శరీర ఉష్ట్రోగ్రత మీద కూడా ఉంటుంది. శరీర ఉష్టోగ్రత హెచ్చు తగ్గులు కావడం వల్ల సీజనల్ వ్యాధులు చాలా సులువుగా అటాక్ అవుతాయి. శరీరంలో రక్తప్రసరణ తగ్గుతంది. దీనివల్ల అవయాల పనితీరు మందగిస్తుంది. ఈ సమస్యలు అధిగమించాలంటే శరీర ఉష్టోగ్రత నిలకడగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వంటింట్లో ఉండే పదార్థాలు ఉపయోగించి శరీర ఉష్టోగ్రతను బ్యాలెన్స్ గా ఉంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుంటే..
నల్లమిరియాలు..(Black pepper)
నల్లమిరియాలు వంటల రుచిని పెంచడమే కాకుండా శరీరంలో రక్తప్రసరణను ప్రేరేపిస్తుంది. దీనివల్ల శరీరం చురుగ్గా ఉంటుంది.
ఎర్ర మిరపకాయలు..(red chilli)
ఎర్ర మిరపకాయలలో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. జీవక్రియను పెంచుతుంది.
ఇది కూడా చదవండి: Viral Video: సరదాగా కారులో వెళ్తున్న ఫ్యామిలీకి ఊహించని షాక్.. సడన్ గా ఏనుగు ఎంట్రీ ఇచ్చి ఏం చేసిందో చూడండి!!
దాల్చిన చెక్క..(cinnamon)
దాల్చిన చెక్క రక్తనాళాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
అల్లం..(ginger)
అల్లం వేడిగుణం కలిగి ఉంటుంది. చలికాలంలో వంటలలో అల్లాన్ని బాగా ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. తాపజనక లక్షణాల కారణంగా అల్లం చలి నుండి ఉపశనం కలిగిస్తుంది.
ఏలకులు..(cardamom)
ఏలకులు శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి. సువాసన కారణంగా ఏలకులను అమితంగా ఇష్టపడతారు. శరీరంలో ఉష్టోగ్రతను బ్యాలెన్స్ ఉంచుతాయి. వంటలల్లో కానీ, విడిగా ఒక ఏలకును నోట్లో వేసుకుని మెల్లిగా నమిలి తింటే మంచి ఫలితాలు ఉంటాయి.
ఇది కూడా చదవండి: ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే.. గంపెడు లాభాలు!
లవంగాలు..(cloves)
లవంగాలు పోషకాలకు పవర్ హౌస్ అని చెప్పవచ్చు. దీనిని వంటల్లో ఉపయోగించవచ్చు. ఏలకుల లానే రోజు ఒక లవంగాన్ని మెల్లిగా నమిలి తినవచ్చు. చలికాలంలో శరీర ఉష్టోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది.
ఇది కూడా చదవండి: తల్లిదండ్రులు చిన్నతనం నుండే పిల్లలలో పెంచాల్సిన 8 అలవాట్లు ఇవీ..!
వెల్లుల్లి..(garlic)
వెల్లుల్లి రోగనిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. వంటకాల రుచి పెంచడంలోనూ, శరీర ఉష్ట్రోగ్రత బ్యాలెన్స్ గా ఉంచడంలో సహాయపడుతుంది.
(గమనిక: ఇది ఆహార నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏదైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Dec 21 , 2023 | 03:23 PM