Heart Health: ఈ లైఫ్‌స్టైల్ అలవాట్లు మార్చుకోకపోతే మీ గుండెను మీరే రిస్క్‌లో పెట్టుకున్నట్టే..!
ABN, First Publish Date - 2023-04-04T12:33:45+05:30
ఇతర అవయవాల మాదిరిగానే మానవ హృదయం కూడా అనేక వ్యాధులకు లోనవుతుంది. చివరికి అది పనిచేసే విధానాన్ని సైతం ప్రభావితం చేస్తుంది.
ఇతర అవయవాల మాదిరిగానే మానవ హృదయం కూడా అనేక వ్యాధులకు లోనవుతుంది. చివరికి అది పనిచేసే విధానాన్ని సైతం ప్రభావితం చేస్తుంది. ఇక ప్రభావితం చేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఇక అంతే సంగతులు. గుండె అనేక కారణాల వల్ల దెబ్బతింటుంది. నిత్య జీవితంలో కొన్ని జీవనశైలి అలవాట్లు ఎటువంటి హెచ్చరిక సంకేతాలు ఇవ్వకుండా క్రమంగా గుండెను బలహీనపరుస్తాయి.
అధిక బరువు (Over Weight)..
అధిక బరువు అనేది మనకు కేవలం ఉండాల్సిన దానికంటే అదనపు కిలోలని మనకు అనిపించవ్చు కానీ అది గుండెకు హాని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బొడ్డు ప్రాంతం చుట్టూ అధిక బరువు ఉండటం గుండెకు చాలా ప్రమాదమని చెబుతున్నారు. అదనపు కిలోలను మోయడం, ముఖ్యంగా బొడ్డు చుట్టూ కొవ్వుకు పేరుకు పోవడమనేది.. గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. మధుమేహం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది.అధిక బరువుతో ఉన్నవారు.. మీ ప్రారంభ బరువులో కేవలం 5% నుంచి 10% వరకూ కోల్పోవడం వల్ల మీ బీపీ, బ్లడ్ షుగర్‌లో పెను మార్పు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తక్కువ శారీరక శ్రమ..
గుండె ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా ఉంచడంలో వ్యాయామాలు చక్కగా పని చేస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం.. ప్రతి నలుగురు పెద్దవారిలో ఒకరు.. అలాగే 81% మంది కౌమారదశలో ఉన్నవారు తగినంత శారీరక శ్రమ చేయరు. గుండెపోటు, రక్తపోటు వంటి నాన్-కమ్యూనికేషన్ వ్యాధుల సంఖ్య 2020 - 2030 మధ్య ఎలా పెరుగుతుందో కూడా ఈ నివేదిక వెల్లడించింది. ఏ పని చేయకుండా ఉండటం వల్ల ధమనులలో కొవ్వు పేరుకుపోతుంది, ఇది బ్లడ్ ఫ్లోకి అంతరాయం కలిగిస్తుంది. తద్వారా గుండెపోటుకు దారితీస్తుంది.
కాలేయం పట్ల శ్రద్ధ వహించకపోవడం..
గుండె ఆరోగ్యంతో కాలేయానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆల్కహాల్ వల్ల కాలేయంలో కొవ్వు అసాధారణంగా పేరుకుపోవడంతో గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఓ అధ్యయనం తేల్చింది. 2005 నుంచి 2018 వరకు జాతీయ ఆరోగ్య సర్వే డేటాను అధ్యయనం చేసిన పరిశోధకులు.. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి పెద్దవారు, పురుషులు, మధుమేహం, కరోనరీ హార్ట్ డిసీజ్ ఉన్నవారికి ముఖ్యంగా గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. కాలేయాన్ని రక్షించుకోవాలంటే.. ప్రాసెస్ చేసిన ఫుడ్, డ్రింక్స్, ఉప్పును ఆహారం నుంచి మినహాయించాలి.
ఆల్కహాల్, స్మోకింగ్..
ఆల్కహాల్, స్మోకింగ్ వలన చాలా సమస్యలు వస్తాయి. రోజూ మద్యపానం, స్మోకింగ్ చేయడం వలన కొన్ని రకాల హృదయ సంబంధ వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతికూల ప్రభావాలలో బీపీ, ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు పెరుగుతాయి. బీపీ, స్ట్రోక్, గుండె వైఫల్యం వంటి ప్రమాదాలు సంభవిస్తాయి.
ఉప్పు ఎక్కువగా తినడం
ప్రాసెస్డ్ ఫుడ్ ద్వారా మనం అధికంగా ఉప్పును స్వీకరిస్తాం. ఉప్పును ఎంత తక్కువ తీసుకుంటే మన గుండె అంత ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజూ మనం 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో తయారు చేసుకునే పదార్థాలకు వరకూ ఓకే. వాటి ద్వారా మనం పెద్దగా ఉప్పును తీసుకోం కానీ ప్రాసెస్డ్ ఫుడ్ నుంచి మాత్రం మనం పెద్ద మొత్తంలో ఉప్పును తీసుకుంటాం. కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
Updated Date - 2023-04-04T12:33:45+05:30 IST