ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

China On Article 370: ‘ఆర్టికల్ 370 రద్దు’ తీర్పుపై చైనా వక్రబుద్ధి.. లద్దాఖ్‌ని ఏర్పాటు చట్టవిరుద్ధమంటూ..

ABN, Publish Date - Dec 14 , 2023 | 02:58 PM

జమ్ముకశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ‘ఆర్టికల్ 370’ని రద్దు చేయాలని నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అలాగే.. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా

China On Article 370: జమ్ముకశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ‘ఆర్టికల్ 370’ని రద్దు చేయాలని నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అలాగే.. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా రూపొందించడాన్ని కూడా న్యాయస్థానం సమర్థించింది. అయితే.. ఈ తీర్పుపై తాజాగా చైనా తన అక్కడు వెళ్లగక్కింది. భారత్ నిర్ణయాన్ని తాము అంగీకరించడం లేదని పేర్కొంది. అంతేకాదు.. లద్దాఖ్ ఏర్పాటుని సైతం తాము గుర్తించట్లేదని కుండబద్దలు కొట్టింది.


ఈ విషయంపై చైనా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ‘‘భారతదేశం ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా స్థాపించిన లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని మేము ఎన్నడూ గుర్తించలేదు. (ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పుని ఉద్దేశిస్తూ..) భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో సరిహద్దు పశ్చిమ భాగం చైనాకు చెందిందన్న వాస్తవ పరిస్థితిని మార్చలేం. ఆ ప్రాంతం (లద్దాఖ్) ఎప్పటికీ మాదే’’ అంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు పాకిస్తాన్ సైతం ఇలాగే రెచ్చిపోయి వ్యాఖ్యలు చేసింది. 2019 ఆగస్టు 5వ తేదీన భారత్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాల్ని అంతర్జాతీయ చట్టం గుర్తించలేదని, కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అంతర్జాతీయంగా చట్టపరమైన విలువ లేదని వ్యాఖ్యానించింది.

అంతేకాదు.. కశ్మీరి ప్రజలు, పాకిస్తాన్ అభీష్టానికి వ్యతిరేకంగా ఈ భూభాగం హోదాపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే హక్కు భారత్‌కు లేదని పాక్ తన వక్రబుద్ధి చూపించింది. ఈ వ్యాఖ్యల్ని సైతం చైనా సమర్థించింది. కశ్మీర్ విషయంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య చాలాకాలంగా వివాదం నడుస్తోందని, యూఎన్ఎస్‌సీ తీర్మానాల ప్రకారం దీనిని శాంతియుతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని మావో నింగ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో (జమ్ముకశ్మీర్) శాంతి, సుస్థిరత ఏర్పడేందుకు ఇరుపక్షాలు భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఉచిత సలహా ఇచ్చింది. చైనా విషయంలో కశ్మీర్ వైఖరి స్పష్టంగా ఉందని చెప్పుకొచ్చింది.

Updated Date - Dec 14 , 2023 | 02:58 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising