Share News

Israel-Hamas War: కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ఆమోదం.. ఇంతటితో యుద్ధం ఆగుతుందా..?

ABN , First Publish Date - 2023-11-22T08:10:46+05:30 IST

ఆరు వారాలకుపైగా భీకరంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ యుద్ధం రెండు దేశాల మధ్య మొటిసారిగా సంధి కుదిరించింది. ఈ సంధిలో భాగంగా కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది.

Israel-Hamas War: కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ఆమోదం.. ఇంతటితో యుద్ధం ఆగుతుందా..?

ఆరు వారాలకుపైగా భీకరంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ యుద్ధం రెండు దేశాల మధ్య మొటిసారిగా సంధి కుదిరించింది. ఈ సంధిలో భాగంగా కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. ఇందుకుగానూ తమ చెరలో ఉన్న 50 మంది ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేసేందుకు హమాస్ సైన్యం ఒప్పుకుంది. ఇందులో అనేక మంది మహిళలు, చిన్నారులకు హమాస్ విముక్తి కల్పించనుంది. రోజుకు 12 మంది చొప్పున 4 రోజుల్లో వీరిని విడుదల చేయనున్నారు. దీనికి ప్రతిఫలంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా తమ చెరలో ఉన్న పలువురు పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. దీంతో ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చడానికి కొన్ని రోజులుగా అమెరికా, ఖతార్ తదితర దేశాలు చేస్తున్న ప్రయత్నాలు సఫలీక‌ృతమయ్యాయి. అక్టోబర్ 7 నుంచి ప్రారంభమైన యుద్ధంలో తొలి సారి కాల్పుల విరమణ ఒప్పందం జరగడం గమనార్హం.


అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా కాదు. నాలుగు రోజులకు మాత్రమే. ఈ నాలుగు రోజుల వ్యవధిలోనే హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ పౌరులను, ఇజ్రాయెల్ చెరలో ఉన్న పాలస్తీనా ఖైదీలు విడుదల కానున్నారు. ఆ తర్వాత మళ్లీ యథావిధిగా ఇజ్రాయెల్ నుంచి కాల్పులు కొనసాగే అవాకాశాలున్నాయి. పైగా ఈ ఒప్పందంతో యుద్ధం ముగియదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలపడానికి ముందే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హమాస్‌ను పూర్తిగా నిర్మూలించే వరకు, బందీలుగా ఉన్న వారందరినీ విడిపించే వరకు యుద్ధం కొనసాగుతుందని నెతన్యాహు చెప్పారు. కాగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒప్పందానికి ఖతార్ అధికారులు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఈ ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సహాయం చేశారని, తద్వారా తక్కువ డిమాండ్లతో ఎక్కువ మంది బందీలు విడుదలవుతున్నట్టు పేర్కొన్నారు. కాగా ఈ యుద్ధం కారణంగా గాజాలో 3 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని అక్కడి అధికారులు తెలిపారు. అక్టోబర్ 7న ప్రారంభమైన ఈ యుద్ధంలో రెండు వైపుల వేలాది ప్రాణాలు కోల్పాయారు.

Updated Date - 2023-11-22T08:10:48+05:30 IST