ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jaishankar - Rishi Sunak: దీపావళి సందర్భంగా బ్రిటన్ ప్రధానికి బహుమతులు పంపిన ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2023-11-13T09:13:27+05:30

ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్‌ను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియచేశారు. ఆదివారం భార్య క్యోకోతో కలిసి సతీసమేతంగా 10 డౌనింగ్ స్ట్రీట్‌కు వెళ్లిన జైశంకర్.. రిషి సునాక్, అక్షత మూర్తి దంపతులను కలిశారు.

లండన్: ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్‌ను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియచేశారు. ఆదివారం భార్య క్యోకోతో కలిసి సతీసమేతంగా 10 డౌనింగ్ స్ట్రీట్‌కు వెళ్లిన జైశంకర్.. రిషి సునాక్, అక్షత మూర్తి దంపతులను కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ తరఫున రిషి సునాక్‌కు జైశంకర్ దీపావళి శుభాకాంక్షలు తెలియచేశారు. మోదీ పంపిన దీపావళి కానుకలు వినాయకుడి విగ్రహం, టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌ను రిషి సునాక్‌కు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వివరాలను జైశంకర్, రిషి సునాక్ ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. "దీపావళి రోజున ప్రధాన మంత్రి రిషి సునక్‌ను నన్ను పిలవడం ఆనందంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాను. భారతదేశం, యుకే సమకాలీన కాలానికి సంబంధించిన సంబంధాలను పునర్నిర్మించడంలో చురుకుగా నిమగ్నమై ఉన్నాయి. సునాక్‌ దంపతుల ఆత్మీయ ఆదరణ, దయతో కూడిన ఆతిథ్యానికి ధన్యవాదాలు” అని జైశంకర్ ట్వీట్ చేశారు.


కాగా శనివారం ప్రారంభమైన జైశంకర్ యూకే పర్యటన ఈ నెల 15 వరకు కొనసాగనుంది. ఈ పర్యటనలో ఆయన యూకే విదేశాంగ శాఖ సెక్రటరీ జేమ్స్ క్లెవర్లీతోపాటు పలువరు అధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో భారత్, యూకే ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరగనుంది. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టిన తొలి నల్లజాతాయుడనే సంగతి తెలిసిందే. సునాక్ భార్య అక్షతా మూర్తి సైతం భారత సంతతికి చెందిన వారే. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కుమార్తెనే అక్షతా మూర్తి అనే సంగతి విధితమే. కాగా నవంబర్ 3న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధానమంత్రి రిషి సునాక్ ఉచిత వాణిజ్య ఒప్పందం పురోగతిపై టెలిఫోన్‌లో చర్చించారు. ఈ సందర్భంగా క్రికెట్ ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తున్నందుకు మోదీని సునాక్ అభినందించారు. ఇరువురు నేతలు ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి కూడా మాట్లాడుకున్నారు. ఇద్దరు కూడా ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను ఖండించారు. అలాగే పాలస్తీనా ప్రజలకు టెర్రర్ గ్రూప్ ప్రాతినిధ్యం వహించదనే విషయాన్ని ఉద్ఘాటించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరం గురించి కూడా వారు చర్చించారు.

Updated Date - 2023-11-13T09:13:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising