US President Biden: వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ఘటన తర్వాత రష్యాలో పరిస్థితులపై బైడెన్ ఆరా..!
ABN, First Publish Date - 2023-06-26T17:33:20+05:30
ఇటీవల రష్యాలో నెలకొన్న పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తో ఆదివారం ఫోన్‌లో చర్చించినట్లు వైట్‌హౌజ్ వర్గాలు తెలిపాయి.
ఇటీవల రష్యాలో(Russia) నెలకొన్న పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(US President Joe Biden), ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy) తో ఆదివారం ఫోన్‌లో చర్చించినట్లు వైట్‌హౌజ్ వర్గాలు తెలిపాయి. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ సాగిస్తున్న ఎదురుదాడిపై కూడా బైడెన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతును మరోసారి పునరు ద్ఘాటించారు. భద్రత, ఆర్థిక, మానవతా సాయం అందుతూనే ఉంటుందని బైడెన్ స్పష్టం చేసినట్లు వైట్‌హౌజ్ వర్గాలు తెలిపాయి.
చాలాకాలంగా రష్యా బలహీనతలను కప్పిపుచ్చుకునేందుకు, తన మూర్ఖత్వాన్ని సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. బెలారస్ అధ్యక్షుడి దౌత్యంతో రష్యాలో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు సఫలం కావడంతో కిరాయి సేన వాగ్నర్ గ్రూప్ వెనక్కి తగ్గిందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ముగిసిన వెంటనే పుతిన్ వారిపై అభియోగాలను ఎత్తివేస్తున్నట్లు రష్యా ప్రకటించిందని జెలెన్‌స్కీ తెలిపారు.
Updated Date - 2023-06-26T17:33:20+05:30 IST