ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Floods: రాష్ట్రాన్ని వణికిస్తున్న వరదలు.. 14 మంది మృతి.. 102 మంది గల్లంతు.. ఏకంగా 20 వేల మంది..

ABN, First Publish Date - 2023-10-05T12:28:54+05:30

సిక్కిం రాష్ట్రాన్ని కుండపోత వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వరుణుడు దంచికొడుతుండడంతో రాష్ట్రం విలవిలలాడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది.

గ్యాంగ్‌టక్: సిక్కిం రాష్ట్రాన్ని కుండపోత వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వరుణుడు దంచికొడుతుండడంతో రాష్ట్రం విలవిలలాడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. నదులు, సరస్సులు, చెరువులు ఉప్పొంగడంతో వరద నీటిలో అనేక మంది గల్లంతయ్యారు. పలువురు చనిపోయారు. కుండపోత వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు పరివాహాక ప్రాంతంలోని తీస్తా నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో తీర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. మరోవైపు చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో వరదలు సంభవించాయి. దీంతో ఆకస్మిక వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 14 మంది చనిపోయారు. 22 మంది ఆర్మీ సిబ్బంది సహా ఇప్పటివరకు 102 మంది గల్లంతయ్యారు.


దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 3 వేల మంది పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని సిక్కిం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విబి పాఠక్‌ అధికారికంగా వెల్లడించారు. ఈ భారీ వర్షాలు, వరదల కారణంగా సిక్కింలో రాష్ట్రంలో ఇప్పటివరకు 20 వేల మంది ప్రభావితమయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా అదృశ్యమైన సైనిక సిబ్బంది క్షేమం కోసం ప్రార్థించారు. సిక్కిం ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌లో దీనిని విపత్తుగా ప్రకటించింది. కాగా బుధవారం సంభవించిన వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైన సంగతి తెలిసిందే. అందులో ఇప్పటివరకు ఒకరు మాత్రమే దొరికారు. మిగతా 22 మంది అచూకీ కోసం వెతుకులాట కొనసాగుతుంది.

Updated Date - 2023-10-05T12:28:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising