40 MP seats: మన టార్గెట్ 40 ఎంపీ సీట్లు !
ABN, First Publish Date - 2023-04-16T12:10:41+05:30
వచ్చే యేడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 39 స్థానాలతో పాటు మరో లోక్సభ స్థానాన్ని కలుపుకుని మొత్తం 40 లోక్సభ సీట్లలో గెలుపే లక్ష్యంగా
చెన్నై, (ఆంధ్రజ్యోతి): వచ్చే యేడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 39 స్థానాలతో పాటు పుదుచ్చేరిలోని లోక్సభ స్థానాన్ని కలుపుకుని మొత్తం 40 లోక్సభ సీట్లలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్(DMK President MK Stalin) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల(234 assembly constituencies) పర్యవేక్షకులతో ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్(Video conference) నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి స్టాలిన్ మాట్లాడుతూ.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 40 సీట్లలో విజయం సాధించి తీరాల్సిందేనని పేర్కొన్నారు. ఇదే మన లక్ష్యమన్నారు. ఈ లక్ష్య సాధన దిశగా కార్యకర్తల కార్యాచరణ ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో కొత్త వారికి పార్టీ సభ్యత్వం కల్పించే సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో పర్యవేక్షకులు క్షేత్రస్థాయి శ్రేణులతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆ సమయంలో ప్రజలు తీసుకొచ్చే సమస్యలను తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారంలో పర్యవేక్షకులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని స్టాలిన్ సూచించారు. ఇదిలావుండగా మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి జయంతి వేడుకలు జూన్ 3న జరుగనున్నాయి. ఆ రోజుకు కొత్తగా కోటి మంది సభ్యత్వాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో డీఎంకే శ్రేణులు పని చేస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం 50 వేల మంది సభ్యులకు పార్టీ సభ్వత్వం కల్పించాలని పార్టీ అధిష్ఠానం కోరింది.
Updated Date - 2023-04-16T12:11:02+05:30 IST