Viral: కేసు విచారణ పట్ల అసంతృప్తితో ఏకంగా న్యాయమూర్తి కారునే ధ్వంసం చేశాడు
ABN, First Publish Date - 2023-06-22T17:06:01+05:30
తన విడాకుల (divorce) కేసు విచారణ పట్ల అసంతృప్తితో ఉన్న 55 ఏళ్ల వ్యక్తి ఏకంగా న్యాయమూర్తి (judge) కారునే ధ్వంసం చేసిన ఘటన కేరళలోని తిరువల్ల ఫ్యామిలీ కోర్టులో (Kerala Family Court) చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 55 ఏళ్ల వ్యక్తి అతనికి, అతని భార్యకు మధ్య నెలకొన్న వైవాహిక వివాదాన్ని పరిష్కరించే విషయంలో కోర్టులో జరుగుతున్న విచారణ పట్ల అసంతృప్తిగా ఉన్నాడు. కోర్టు విచారణలో తనకు న్యాయం జరగడం లేదని, తన భార్య తరఫు న్యాయవాది, న్యాయమూర్తి ఆమెకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నాడు.
కేరళ: తన విడాకుల (divorce) కేసు విచారణ పట్ల అసంతృప్తితో ఉన్న 55 ఏళ్ల వ్యక్తి ఏకంగా న్యాయమూర్తి (judge) కారునే ధ్వంసం చేసిన ఘటన కేరళలోని తిరువల్ల ఫ్యామిలీ కోర్టులో (Kerala Family Court) చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 55 ఏళ్ల వ్యక్తి అతనికి, అతని భార్యకు మధ్య నెలకొన్న వైవాహిక వివాదాన్ని పరిష్కరించే విషయంలో కోర్టులో జరుగుతున్న విచారణ పట్ల అసంతృప్తిగా ఉన్నాడు. కోర్టు విచారణలో తనకు న్యాయం జరగడం లేదని, తన భార్య తరఫు న్యాయవాది, న్యాయమూర్తి ఆమెకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నాడు. విచారణ సమయంలో తన వాదనను సరిగ్గా వినడంలేదని, వారు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు వ్యక్తి తిరువల్ల కోర్టు కాంప్లెక్స్ లోపల ఆగి ఉన్న న్యాయమూర్తి కారును ధ్వంసం చేశాడు. కారు అద్దాలన్నింటినీ పగలగొట్టాడు. దీనికి సంబంధించిన విజువల్స్ స్థానిక టీవీ ఛానెళ్లలో మార్మోగిపోయాయి.
కాగా కోర్టు పనికి అంతరాయం కల్గించడం, బెదిరింపులకు పాల్పడడంతోపాటు ప్రజా ఆస్తులను ధ్వంసం చేసినందుకు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతనిపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసినట్టు తిరువల్ల పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. కాగా మొదటగా 2017లో పతనంతిట్టలోని కోర్టులో ఈ కేసు విచారణ జరిగిందని ఆయన చెప్పారు. అయితే ఆ కోర్టుపై తనకు నమ్మకం లేదని, కేసును ఆ కోర్టు నుంచి బదిలీ చేయాలని పేర్కొంటూ ఆ 55 ఏళ్ల వ్యక్తి కేరళ హైకోర్టును ( Kerala High Court ) ఆశ్రయించాడని తెలిపారు. దీంతో ఆ కేసును ఈ సంవత్సరం తిరువల్ల ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేసినట్టు సదరు పోలీస్ అధికారు చెప్పారు.
Updated Date - 2023-06-22T18:17:58+05:30 IST