ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DRDO scientist : పాకిస్థానీ మహిళ మోజులో భారత దేశ రహస్యాలు బయటపెట్టిన డీఆర్‌డీఓ శాస్త్రవేత్త

ABN, First Publish Date - 2023-07-08T12:02:25+05:30

ఓ పాకిస్థానీ మహిళతో సాన్నిహిత్యం కోరుకున్న డీఆర్‌డీఓ (DRDO) శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ అత్యంత దారుణంగా మన దేశ రహస్యాలను ఆమెకు వెల్లడించారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఆయనను మే 3న అరెస్ట్ చేసి, జూన్ 30న ఆయనపై ఛార్జిషీటును దాఖలు చేసింది.

Pradeep Kurulkar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుణే (మహారాష్ట్ర) : కాంత, కనకాల మోజులో పడితే దేశ భద్రతను సైతం పణంగా పెడతారని మరోసారి రుజువైంది. ఓ పాకిస్థానీ మహిళతో సాన్నిహిత్యం కోరుకున్న డీఆర్‌డీఓ (DRDO) శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ అత్యంత దారుణంగా మన దేశ రహస్యాలను ఆమెకు వెల్లడించారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఆయనను మే 3న అరెస్ట్ చేసి, జూన్ 30న ఆయనపై ఛార్జిషీటును దాఖలు చేసింది. ఈ అభియోగపత్రంలో తెలిపిన వివరాలను పరిశీలించినపుడు ఒళ్లు గగుర్పొడుస్తుంది.

రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)లో పరిశోధన, అభివృద్ధి విభాగం డైరెక్టర్‌ ప్రదీప్ కురుల్కర్ (60) గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఏటీఎస్ ఆయనను మే 3న అరెస్ట్ చేసింది. దర్యాప్తు అనంతరం జూన్ 30న స్పెషల్ కోర్టులో ఛార్జిషీటును దాఖలు చేసింది. పాకిస్థానీ ఆపరేటివ్ (మహిళ)తో ఆయన సంభాషణలకు సంబంధించిన చాట్స్‌ను గుర్తించినట్లు తెలిపింది. పాకిస్థానీ మహిళతో మరింత సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడం కోసం ఆయన ఆమెకు మన దేశానికి సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని అందజేశారని తెలిపింది.

ఏటీఎస్ దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం, పాకిస్థానీ మహిళా ఏజెంట్ అనేక నకిలీ అకౌంట్లతో ప్రదీప్ కురుల్కర్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. జర దాస్‌గుప్తా, జుహీ అరోరా అనే పేర్లతో ఆ ఏజెంట్ ఆయనను సంప్రదించింది. ఈ పేర్లతోనే రెండు వేర్వేరు ఫోన్ నంబర్లతో మెసేజింగ్ యాప్స్‌లో కూడా ఖాతాలను సృష్టించింది. ఈ రెండు ఫోన్ నంబర్లు +44 లండన్ కోడ్‌తో ఉన్నాయి. జరా దాస్‌గుప్తా అనే అకౌంట్‌‌తో జరిగిన సంభాషణలో మిటీయర్ మిసైల్, బ్రహ్మోస్ మిసైల్స్, రఫేల్, ఆకాశ్, అస్త్ర మిసైల్ సిస్టమ్స్‌ గురించి చాలా వివరంగా ఆయన చెప్పారు. మిటీయర్ మిసైల్ అప్పట్లో డీఆర్‌డీవోలో అభివృద్ధి దశలో ఉంది. అగ్ని-6 మిసైల్ లాంచర్ గురించి కూడా ఆయన వివరించారు. దీని అభివృద్ధిలో ఆయన పాత్ర కూడా ఉంది.

కురుల్కర్ ఆ మహిళను మరింత ఆకర్షించడం కోసం డీఆర్‌డీఓలో అభివృద్ధి దశలో ఉన్న ప్రాజెక్టుల గురించి వివరించారు. మానవ రహిత గగనతల యుద్ధ వాహనం భారత్ క్వాడ్‌కాప్టర్, మీడియం అల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యురెన్స్ అన్‌మ్యాన్డ్ కంబాట్ ఎయిర్ వెహికిల్ రుస్తుమ్ గురించి వివరించారు. ఆ మహిళను ఆయన ఎంతో ముద్దుగా ‘బేబ్’ అని సంబోధించారు. అగ్ని-6 లాంచర్ టెస్ట్ గురించి ఆమె ప్రశ్నించినపుడు, ఆయన స్పందిస్తూ, ‘‘ఈ లాంచర్ నా డిజైనే బేబ్.. అది గొప్పగా విజయవంతమైంది’’ అని చెప్పారు.

వీరిద్దరి మధ్య ఈ సంభాషణలు 2022 సెప్టెంబరు నుంచి 2023 ఫిబ్రవరి మధ్యలో జరిగినట్లు ఏటీఎస్ ఛార్జిషీటులో ఆరోపించారు. ఆయన వ్యవహార శైలిపై అనుమానం రావడంతో డీఆర్‌డీఓ మహారాష్ట్ర ఏటీఎస్‌కు మార్చిలో ఫిర్యాదు చేసింది.

ఇవి కూడా చదవండి :

Rahul Gandhi : పొలంలో దిగి, నాట్లు వేసి, రైతులతో ఆత్మీయంగా మాట్లాడిన రాహుల్ గాంధీ

West Bengal panchayat election : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. నలుగురు టీఎంసీ కార్యకర్తల హత్య..

Updated Date - 2023-07-08T12:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising